Gopichand : గోపీచంద్ పాన్ ఇండియా.. నార్త్ లో కూడా రామబాణం రిలీజ్..
గోపీచంద్, డింపుల్ హయతి(Dimple Hayathi) జంటగా, జగపతి బాబు(Jagapathi Babu), ఖుష్బూ ముఖ్య పాత్రల్లో శ్రీవాస్(Sriwass) దర్శకత్వంలో తెరకెక్కిన రామబాణం సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.

Gopichand Ramabanam releasing in hindi also
Gopichand : ఇటీవల ఆల్మోస్ట్ అందరు పెద్ద హీరోలు తమ సినిమాలను పాన్ ఇండియా(Pan India) రిలీజ్ చేస్తున్నారు. మీడియం రేంజ్ హీరోలు కూడా తమ సినిమాలను పాన్ ఇండియా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సినిమాని జస్ట్ వేరే భాషల్లో డబ్బింగ్(Dubbing) చెప్పి కొన్ని థియేటర్స్ లో అయినా రిలీజ్ చేసి పాన్ ఇండియా అనిపించుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు గోపీచంద్ కూడా తన సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నాడు.
గోపీచంద్(Gopichand) మే 5న రామబాణం(Ramabanam) సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. గోపీచంద్, డింపుల్ హయతి(Dimple Hayathi) జంటగా, జగపతి బాబు(Jagapathi Babu), ఖుష్బూ ముఖ్య పాత్రల్లో శ్రీవాస్(Sriwass) దర్శకత్వంలో తెరకెక్కిన రామబాణం సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇప్పటికే సినిమా నుంచి ట్రైలర్, సాంగ్స్ రిలీజయి ప్రేక్షకులని అలరిస్తున్నాయి.
SSMB28 : రూమర్స్ కి కౌంటర్ ఇస్తూ.. సూపర్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. మే 31!
ఇప్పటివరకు తెలుగులోనే రిలీజ్ చేస్తారనుకున్న రామబాణం సినిమా ఇప్పుడు హిందీలో కూడా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే హిందీ డబ్బింగ్ పూర్తి చేసి హిందీ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇటీవల కొన్ని సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాక కొన్ని రోజులకు హిందీలో రిలీజ్ చేస్తున్నారు. కానీ రామబాణం తెలుగుతో పాటే హిందీలో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. నార్త్ బెల్ట్ లో కూడా రామబాణం చాలా థియేటర్స్ లోనే రిలీజ్ అవుతోంది. B4U మరియు గ్రాండ్ మాస్టర్స్ నిర్మాణ సంస్థలు ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేస్తున్నాయి. మరి గోపీచంద్ హిందీలో కూడా సక్సెస్ కొట్టి అక్కడ కూడా మార్కెట్ క్రియేట్ చేసుకుంటాడేమో చూడాలి.
B4U, GRAND MASTER TO RELEASE ‘RAMA BANAM’… The dubbed #Hindi version and #Telugu version of #RamaBanam – the upcoming #Telugu film starring #Gopichand – will be released by B4U and Grand Master across all North states [except Southern states] on 5 May 2023… Directed by Sriwass.… pic.twitter.com/l9SMpxWiOY
— taran adarsh (@taran_adarsh) April 27, 2023