Heroine sreeleela participated in Green India Challenge at Hyderabad
Sreeleela : పెళ్ళిసందడి సినిమాతో క్యూట్ గా కనిపించిన శ్రీలీల ధమాకా సినిమాతో తనలో ఉన్న మాస ని బయటపెట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ఇప్పుడు శ్రీలీల చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. తాజాగా శ్రీలీల హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మరియు హస్పటాలిటీ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటింది. ఈ కార్యక్రమంలో అక్కడి విద్యార్థులు కూడా పాల్గొన్నారు.
రాజ్యసభ ఎంపీ శ్రీ సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఇప్పటికే చాలా మంది స్టార్లు భాగమయ్యారు. తాజాగా శ్రీలీల ఈ కార్యక్రమంలో పాల్గొని ఇలాంటి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని, ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటికి 17 కోట్ల మొక్కలు నాటడం గొప్పవిషయమని తెలిపింది.
Gang Leader: మెగా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. వాయిదా పడ్డ చిరంజీవి మూవీ!
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఎంపీ సంతోష్ కుమార్ కి శ్రీలీల కృతజ్ఞతలు తెలిపింది. ఆ తర్వాత హీరోయిన్స్ శాన్వి శ్రీవాస్తవ్, అనుపమ పరమేశ్వరన్ లకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇచ్చింది. వారితో పాటు తన అభిమానులు, ప్రతి ఒక్కరు కనీసం మూడు మొక్కలను నాటాలని శ్రీలీల తెలిపింది.