Varsha Bollamma: నా పెళ్లి చూపులు చూడాలంటే ఆహాలో చూడండి.. వర్ష బొల్లమ్మ!

తెలుగు, తమిళ సినిమాలు నటిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్న హీరోయిన్ "వర్ష బొల్లమ్మ". దీపావళికి విడుదలైన స్వాతిముత్యం కూడా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ అమ్మడు గురించి పలు వెబ్ సైట్ లో ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ అందాల భామ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు..

Heroine Varsha Bollamma Reaction on her Marriage Rumours

Varsha Bollamma: తెలుగు, తమిళ సినిమాలు నటిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్న హీరోయిన్ “వర్ష బొల్లమ్మ”. ఈ ముద్దుగుమ్మ చేసింది కొన్ని చిత్రాలే అయినా మంచి పేరున్న పాత్రలను ఎన్నుకుంటూ సెలెక్టివ్ గా ఇండస్ట్రీలో ముందుకు వెళ్తుంది. తెలుగులో “మిడిల్ క్లాస్ మెలోడీస్”, “స్టాండ్ అప్ రాహుల్” వంటి కామెడీ సినిమాల్లో నటించి అలరించింది.

Varsha Bollamma: అందాల భామ వర్ష బొల్లమ్మ క్యూట్ పిక్స్!

దీపావళికి విడుదలైన స్వాతిముత్యం కూడా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ అమ్మడు గురించి పలు వెబ్ సైట్ లో ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ అందాల భామ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు, ఒక బడా మీరు మాత కొడుకుతో ఆమెకు పెళ్లిచూపులు కూడా అయ్యాయి అంటూ పలు కథనాలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న వర్షం ఆ వార్తలపై స్పందించింది.

“నాకోసం నాకే తెలియకుండా పెళ్లిచూపులు చేసి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసినందుకు అన్ని వెబ్ సైట్స్ కి థాంక్యూ. ఆ అబ్బాయి ఎవరో నాకు చెబితే మా ఇంట్లో వాళ్లకి నేను చెబుతా. ప్రస్తుతం నా పెళ్లి చూపులు చూడాలంటే ఆహారం స్వాతిముత్యం చూడండి” అంటూ ఆ వెబ్ సైట్ లకు అదిరిపోయే సమాధానం వచ్చింది. కాగా వర్ష, బెల్లంకొండ గణేష్ జంటగా నటించిన స్వాతిముత్యం సినిమా ఆహాలో ప్రసారమవుతుంది.