Hey Chikittha : వచ్చే వారం ‘హే చికీతా’ సినిమా రిలీజ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్..
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా..(Hey Chikittha)
Hey Chikittha
Hey Chikittha : అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ పై ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి నిర్మించిన సినిమా ‘హే చికీతా’. అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్.. పలువురు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాని ధనరాజ్ లెక్కల దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా జూలై 24న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, కమెడియన్ అలీ, డైరెక్టర్ వీఎన్ ఆదిత్య.. పలువురు గెస్టులుగా హాజరయ్యారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నేను యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు లైలా సినిమా చేశాను. ఆడియో రైట్స్‌తోనే దానికి లాభం వచ్చింది. హే చికీతా టీంని చూస్తే నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. ఎన్నో జన్మల పుణ్యం చేస్తే గానీ ఇండస్ట్రీలోకి రాలేం. చిన్న సినిమాతో హిట్ కొడితే వచ్చే సంతృప్తి అంతా ఇంతా కాదు అని అన్నారు.
Also Read : Saanve Megghana : మాల్దీవ్స్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న తెలుగు హీరోయిన్..
కమెడియన్ అలీ మాట్లాడుతూ.. బద్రి సినిమాలో హే చికీతా పాట ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమా కూడా అంతే హిట్ అవ్వాలి. ఓ సినిమా తీసి రిలీజ్ చేయడం చాలా కష్టం. భవిష్యత్తులో రైతు అనేవాడు ఉంటాడా? కనిపిస్తాడా? అని అనిపిస్తుంది. రైతు ఉంటేనే దేశం నిలబడుతుంది. రైతు, యువత మీద తీసిన ఈ సినిమా హిట్ అవ్వాలి అని అన్నారు. డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. చదలవాడ శ్రీనివాసరావు గారి నిర్ణయం వల్ల మా దర్శకుల సంఘం నుంచి సినిమాలు రాబోతోన్నాయి. అన్ని క్రాఫ్టులకు పని దొరికేలా చేసిన ఆయనకు థాంక్స్ అని అన్నారు.
ఈ సినిమా నిర్మాత ఎన్. అశోక ఆర్ఎన్ఎస్ మాట్లాడుతూ.. ధన్ రాజ్ చెప్పిన కథ నాకెంతో నచ్చింది. అంజి గారితో కలిసి సినిమాని చేయడం ఆనందంగా ఉంది. జూలై 24న మా సినిమా రాబోతోంది అని తెలిపారు. డైరెక్టర్ ధన్ రాజ్ లెక్కల మాట్లాడుతూ.. రైతులు, యూత్ కోసం ఈ సినిమా చేశాను. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. చరణ్ అర్జున్ అన్న వల్లే నేను ఇక్కడ నిలబడగలిగాను అని తెలిపారు. నటి దివిజ ప్రభాకర్ మాట్లాడుతూ.. చిట్టి అనే పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడు ధన్ రాజ్ గారికి థాంక్స్. ప్రతీ క్షణం సినిమా బెటర్మెంట్ కోసమే ఆలోచిస్తుంటారు. జూలై 24న థియేటర్లోకి హే చికీతా సినిమా వచ్చి అందర్నీ మెప్పిస్తుంది అని అన్నారు.
నటుడు దేవి ప్రసాద్ మాట్లాడుతూ.. కూతురు వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్లడం, లెగసీ కంటిన్యూ చేసే సీన్ చూసి, అందులో యోధ నటన చూసి నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ధన్ రాజ్ మంచి కథను రాసుకున్నారు అని తెలిపారు.
