Nani :నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ మూవీ డిసెంబర్ 7న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇక తన సినిమా ప్రమోషన్స్ అన్నిటిని తానే దగ్గరుండి చూసుకునే నాని.. హాయ్ నాన్న ప్రమోషన్స్ ని కేజ్రీగా నిర్వహిస్తూ ఆడియన్స్ లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఎక్స్ ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ ఇంటరాక్షన్ లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు నాని సమాధానం ఇస్తూ వచ్చారు.
ఈ నేపధ్యలోనే ఒక నెటిజెన్.. ‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు కదా. మరి వచ్చిన ఎన్నికల ఫలితం పై మీ కామెంట్స్ ఏంటి’ అని ప్రశ్నించాడు. దీనికి నాని బదులిస్తూ.. ”పదేళ్లు ఒక బ్లాక్ బస్టర్ సినిమా చూశాము. ఇప్పుడు థియేటర్ సినిమా మారింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాము” అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
10 yellu blockbuster cinema chusam. Theatre lo cinema maarindhi. Idhi kuda blockbuster avvali ani korukundham:)#AskNani #HiNanna https://t.co/wZHycPk5gN
— Hi Nani (@NameisNani) December 4, 2023
ఇక ఇదే ఇంటరాక్షన్ లో ఒక ఎన్టీఆర్ అభిమాని.. ‘తారక్ అన్నతో మీరు ‘కలిసి ఉన్న ఓ అరుదైన ఫోటోని షేర్ చేయండి’ అంటూ కోరాడు. దీంతో నాని, ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఒక అరుదైన ఫోటోని షేర్ చేశారు. ఆ పిక్ లో ఎన్టీఆర్ అండ్ నాని కౌగిలించుకొని కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
Also read : Nani : ‘బలగం’ వేణు దర్శకత్వంలో నాని సినిమా..!
Idhi ok aa ? 🙂#AskNani #HiNanna https://t.co/3yyBPAXCMx pic.twitter.com/f4G2fxijvt
— Hi Nani (@NameisNani) December 4, 2023
హాయ్ నాన్న విషయానికి వస్తే.. కొత్త దర్శకుడు శౌర్యువ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంటే శృతిహాసన్ ప్రత్యేక పాటలో కనిపించబోతున్నారు. హేశమ్ అబ్దుల్ వహబ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మరి ఈ ఏడాది ఇప్పటికే ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్న నాని.. ఇప్పుడు
హాయ్ నాన్నతో ఇయర్ ఎండింగ్ ని కూడా గ్రాండ్ గా పలుకుతారేమో చూడాలి.