RGV Vyooham : హైకోర్టులో ఆర్జీవీ ‘వ్యూహం’పై వాదనలు.. సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేసుకోండి..

తెలంగాణ హైకోర్టులో టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ రచ్చ. సివిల్ కోర్టులో పరువు నష్ట దావా వేసుకోవాలి గాని ఇలా హైకోర్టులో వేయ్యడం కరెక్ట్ కాదంటూ..

Highcourt judgement on Ram Gopal Varma Vyooham movie release date

RGV Vyooham : తెలంగాణ హైకోర్టులో టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ రచ్చ. చంద్రబాబు ప్రతిష్టని దెబ్బతీసేలా ఈ సినిమా తెరకెక్కించారని, ఆ సినిమా రిలీజ్ ని అడ్డుకోవాలంటూ టీడీపీ నాయకులు.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రేపు రిలీజ్ కావడంతో నేడు ఫైనల్ జడ్జిమెంట్ రాబోతుంది.

ఆర్జీవీ తరపు వాదనలను సీనియర్ కౌన్సిల్ ఎంపీ నిరంజన్ రెడ్డి వినిపించారు. అసలు నారా లోకేశ్ వేసిన రిట్ పిటిషన్ పరిగణలోకి రాదని, రిట్ పిటిషన్ మైనటనబుల్ కాదని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ సెన్సార్ బోర్డు కమిటీ ఉంటుంది. ఒకవేళ సినిమా పై ఏమైనా అబ్జెక్షన్ చేయాలి అనుకుంటే అక్కడ చేయాలని చెప్పుకొచ్చారు. కానీ సెన్సార్ బోర్డు ఎలాంటి అడ్డు చెప్పకుండా వ్యూహం చిత్రానికి సర్టిఫికెట్ ఇచ్చింది. అయినా వ్యక్తులను, పార్టీలను కించపరిచే విదంగా సినిమా ఉంటే సివిల్ కోర్టులో పరువు నష్ట దావా వేసుకోవాలి గాని హైకోర్టులో వేయ్యడం కరెక్ట్ కాదని ఆయన వాదించారు.

అలాగే వ్యూహం చిత్రం ఏమీ డాక్యుమెంటరీ కాదని, సినిమా తెరకెక్కించడంలో కళాకారులకు స్వేచ్చ ఉంటుందని తెలియజేశారు. అది కళాకారులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, వారి హక్కులను కలరాయడం సరైంది కాదని పేర్కొన్నారు. అయినా ఇలాంటి కేసుల్లో న్యాయస్థానాలు ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేదని పేర్కొన్న నిరంజన్ రెడ్డి.. సుప్రీమ్ కోర్టు చెప్పిన విధంగా ఇక్కడ పిటిషన్ వేసే అర్హత లేదని పేర్కొన్నారు. సినిమాలకు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెటే ఫైనల్ అని గట్టిగా వాదించారు.

సినిమాను సినిమా లాగానే చూడాలి కానీ వ్యక్తిగత దూషణలకు వెళ్లడం సరికాదని, సెన్సార్ బోర్డులో చాలా మంది అనుభవజ్నులు ఉంటారని, వారు అన్ని పరిశీలించిన తర్వాతనే సర్టిఫికెట్ ను జారీ చేస్తారని చెప్పుకొచ్చారు.

Also read : Prasanth Narayanan : మలయాళ నటుడు ప్రశాంత్ నారాయణన్ మరణం..

ఇక పిటిషనర్ తరుపు వాదనలను మురళీ ధర్ రావు వినిపించారు. వ్యూహం సినిమా కేవలం పొలిటికల్ అజెండాతో వస్తున్న మూవీ అని న్యాయస్థానానికి తెలియజేశారు. టిడిపి, జనసేన, కాంగ్రెస్ నాయకులను కించపరిచే సన్నివేశాలు అందులో ఉన్నాయని వెల్లడించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను టార్గెట్ గానే సినిమా తెరకెక్కించారని చెప్పుకొచ్చారు. మూవీలో పార్టీలు జెండాలు, నాయకుల వాయిస్ ఓవర్ సైతం ఒరిజినల్ పాత్రలను ప్రతిబించేలా ఉన్నాయని న్యాయమూర్తికి తెలియజేశారు.

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల రాబోతున్నాయని, ఈ సినిమా వలన ఎన్నికల మీద తీవ్ర ప్రభావం పడుతుందని తమ వాదనను వినిపించారు. మరి కాసేపట్లో ఈ సినిమా రిలీజ్ పై హైకోర్టు తీర్పు ప్రకటించనున్నది.

ట్రెండింగ్ వార్తలు