Yash Remuneration : విలన్ పాత్ర కోసం అన్ని వందల కోట్లు.. స్టార్ హీరోలని మించే రెమ్యూనరేషన్..

కేవలం ఒక్క సినిమాలో విలన్ పాత్రలో నటించడానికి ఓ స్టార్ హీరో ఏకంగా 200 కోట్లు తీసుకున్నాడట.

Highest Paid Villains in India : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు ఎవరంటే.. టక్కున చెప్పే పేరు ప్రభాస్, అల్లు అర్జున్. అలాగే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోస్. కానీ ఇప్పుడు స్టార్ హీరోలను కూడా దాటేసే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు ఓ విలన్.

అవును కేవలం ఒక్క సినిమాలో విలన్ పాత్రలో నటించడానికి ఓ స్టార్ హీరో ఏకంగా 200 కోట్లు తీసుకున్నాడట. ఇక ఆ స్టార్ విలన్ మరెవరో కాదు. కన్నడ స్టార్ హీరో యష్. కేజీఎఫ్ 1,2 సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న ఈ స్టార్ హీరో హీరోగానే కాకుండా విలన్ గా కూడా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుడిగా చరిత్ర సృష్టించాడు.

Also Read : Sandhya Theatre Incident : సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌లో ప్ర‌ధాన నిందితుడు అరెస్ట్.. అతని వల్లే ఇలా అయ్యిందా..?

అయితే ఈయన నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ లో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ పాత్రలో నటిస్తున్నందుకు గాను దాదాపుగా 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. కాగా ఇందులో ఆయన రావణుడి పాత్రలో కనిపించనున్నారు. చాలా వరకు స్టార్ హీరోలే ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోలేదు. అలాంటిది విలన్ పాత్రకి ఇంత పెద్ద మొత్తంలో తీసుకుంటున్నాడు యాష్.