Sandhya Theatre Incident : సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌లో ప్ర‌ధాన నిందితుడు అరెస్ట్.. అతని వల్లే ఇలా అయ్యిందా..?

సంధ్య థియేటర్ తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిందితుడు బౌన్సర్ ఆంటోనీని నిన్న అరెస్టు చేశారు చిక్కడపల్లి పోలీసులు.

Sandhya Theatre Incident : సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌లో ప్ర‌ధాన నిందితుడు అరెస్ట్.. అతని వల్లే ఇలా అయ్యిందా..?

The main accused in the Sandhya theater incident was arrested

Updated On : December 24, 2024 / 3:09 PM IST

Sandhya Theatre Incident : పుష్ప 2 రిలీజ్ అయిన సమయంలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఇక దీనికి కారణం అల్లు అర్జున్ అని తనపై కేసు నమోదు చేశారు. ఇక ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి విచారణకి రావాలని అల్లు అర్జున్ కి నోటీసులు పంపారు. దీంతో మంగ‌ళ‌వారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి విచారణకి హాజరయ్యారు బన్నీ.

అయితే సంధ్య థియేటర్ తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిందితుడు బౌన్సర్ ఆంటోనీని నిన్న అరెస్టు చేశారు చిక్కడపల్లి పోలీసులు. అసలు ఈ తొక్కిసలాట మొత్తం జరగడానికి ముఖ్య కారణం ఆయనే అంటున్నారు. అల్లు అర్జున్ విచారణ నేపథ్యంలో బౌన్సర్ ఆంటోనీని సైతం సంధ్య థియేటర్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకురానున్నట్టు తెలుస్తుంది.

Also Read : RRR Documentary : ఓటీటీలోకి ‘RRR డాక్యుమెంటరీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా..?

ఎక్కడ ఈవెంట్ జరిగిన బౌన్సర్లకు ఆర్గనైజర్ గా ఉన్నారు ఆంటోనీ. అలాంటిది ఇప్పుడు ఆయన వల్లే సంధ్య థియేటర్ ఘటన జరగడంతో అందరూ షాక్ లో ఉన్నారు. మరి ఈ విషయానికి సంబందించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.