Rajamouli : మహాభారతంలో నాని.. క్యారెక్టర్ ఏంటని రాజమౌళిని అడిగితే..

హిట్ 3 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం ఘ‌నంగా నిర్వ‌హించారు.

HIT 3 pre release event Rajamouli comments viral

హీరో నాని న‌టిస్తున్న చిత్రం హిట్ . శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. శ్రీనిధి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. హిట్ ఫ్రాంచైజీలో మూడో చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. మిక్కీ జే మేయ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాని హోం బ్యానర్‌ వాల్‌పోస్టర్‌ సినిమా, యునానిమస్‌ ప్రొడక్షన్స్ పై ప్రశాంతి త్రిపురనేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీ మే 1న‌ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ఆదివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించింది. ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా రాజ‌మౌళి విచ్చేశారు. ఈ క్ర‌మంలో యాంక‌ర్ సుమ.. నాని, రాజ‌మౌళిల‌ను సినిమా కాన్సెఫ్టుకు త‌గ్గ‌ట్లుగా ప‌లు ప్ర‌శ్న‌లు అడిగింది.

Mahesh Babu : రాజమౌళి సినిమా షూటింగ్ ఉంది.. ఈడీ విచారణకు రాలేను.. మహేష్ బాబు లేఖ..

మ‌హాభారతం మూవీలో నాని పాత్ర ఫిక్సైంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో నిజ‌మెంతా? అని రాజమౌళిని అడిగింది. అవును ఆ ప్రాజెక్టులో త‌ప్ప‌కుండా నాని ఉంటాడ‌ని రాజ‌మౌళి స‌మ‌ధానం ఇచ్చారు. అయితే.. ఏ పాత్ర అన్న విష‌యాన్ని మాత్రం చెప్ప‌లేదు. ప్ర‌స్తుతం మ‌హేశ్ హీరోగా రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 గురించి ఏదైన అప్‌డేట్ ఇవ్వాల‌ని సుమ కోర‌గా.. రాజ‌మౌళి మాత్రం కాస్త న‌వ్వి ఊరుకున్నారు.

కాగా.. మ‌హాభార‌తం అనేది త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప‌లు సంద‌ర్భాల్లో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.