Hollywood Actress Cameron Diaz announce retirement officially again
Cameron Diaz : ఒకప్పుడు హీరోయిన్స్ గా చేసిన వాళ్లంతా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా చేస్తున్నారు. ఏ సినిమా పరిశ్రమలో అయినా ఇదే జరుగుతుంది. హాలీవుడ్ లో కూడా అంతే. కొంతమంది అయితే రిటైర్మెంట్ ప్రకటించి ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలనుకుంటున్నారు. తాజాగా ఒకప్పుడు హాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న కామెరూన్ డయాజ్ కొన్నాళ్ల క్రితం యాక్టింగ్ కి గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలనుకుంది కానీ కొన్ని సంఘటనలతో మళ్ళీ రిటైర్మెంట్ ని ప్రకటించింది.
కామెరూన్ డయాజ్ 1994 లో ది మాస్క్ అనే సినిమాతో హాలీవుడ్ లో అడుగు పెట్టింది. అనంతరం అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. హాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్స్ తీసుకునే హీరోయిన్స్ లిస్ట్ లో కూడా నిలిచింది కామెరూన్. చివరగా 2014 లో annie అనే ఓ హాలీవుడ్ సినిమాలో నటించి ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేయలేదు. సినీ పరిశ్రమకు దూరంగానే ఉంటూ 2015లో పెళ్లి చేసుకుంది. 2018లో అధికారికంగా తాను సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత ఓ పాపకి తల్లి అయింది. ప్రస్తుతం తన పాప, భర్తతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది.
Power Rangers : మళ్ళీ తిరిగొస్తున్న ఆల్ టైం ఫేవరేట్ పవర్ రేంజర్స్.. 90s కిడ్స్ కి పండగే..
అయితే తన స్నేహితుడు జామి ఫాక్స్ ఆమెని మరోసారి నటించేందుకు ఒప్పించాడు. దీంతో నెట్ ఫ్లిక్స్ నిర్మాణంలో బ్యాక్ ఇన్ యాక్షన్ అనే సినిమా నిర్మాణం మొదలైంది. కామెరూన్ షూటింగ్ లో కూడా పాల్గొంది. కానీ షూటింగ్ లో జరిగిన కొన్ని సంఘటనలు, తన కూతురికి రోజూ అన్ని గంటల దూరంగా ఉండటంతో కామెరూన్ సినిమా చేయనని, ఇకపై అస్సలు సినిమా చేయనని అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆశ్చర్యపోయింది. అయితే అతని స్నేహితుడు జామికి, కామెరూన్ కి గొడవలు అయ్యాయని, సెట్ లో విభేదాలు వచ్చాయని సమాచారం. ఏదైనా కానీ ఒకసారి రిటైర్మెంట్ ప్రకటించి మళ్ళీ నటించడానికి వచ్చి ఇంకోసారి అధికారికంగా రిటైర్మెంట్ అని మళ్ళీ ప్రకటించడంతో కామెరూన్ ప్రస్తుతం హాలీవుడ్ లో వైరల్ గా మారింది.