Power Rangers : మళ్ళీ తిరిగొస్తున్న ఆల్ టైం ఫేవరేట్ పవర్ రేంజర్స్.. 90s కిడ్స్ కి పండగే..
30 ఏళ్ళ చరిత్ర ఉన్న పవర్ రేంజర్స్ ఇప్పుడు మళ్ళీ తిరిగొస్తుంది. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం ఆగిపోయిన పవర్ రేంజర్స్ ని ఇప్పుడు మళ్ళీ నెట్ ఫ్లిక్స్ పరిచయం చేయబోతుంది. అప్పుడు పవర్ రేంజర్స్ క్యారెక్టర్స్ చేసిన...................

Mighty Morphin Power Rangers come back again streaming soon in Netflix
Power Rangers : పవర్ రేంజర్స్(Power Rangers).. మైటీ మార్ఫిన్ పవర్ రేంజర్స్(Mighty Morphin Power Rangers ).. సూపర్ హీరోల టీవీ సిరీస్ 90వ దశకంలో చాలా పెద్ద హిట్. అప్పటి పిల్లలని ఎవర్ని అడిగినా దీని గురించి ఈజీగా చెప్పేస్తారు. హాలీవుడ్(Hollywood) లో మేకింగ్ అయిన ఈ సిరీస్ కి ఇక్కడ ఇండియాలో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 90s కిడ్స్ ఈ సిరీస్ ని చాలా ఇష్టపడ్డారు. ఒకానొక టైములో ఇండియాలోని టీవీ సీరియల్స్ కంటే కూడా ఇదే బాగా పాపులర్ అయింది. అప్పట్లో చిన్న పిల్లలు ఈ సిరీస్ కోసం ఎదురుచూసేవారు. రెడ్, బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, ఎల్లో.. ఇలా అనేక రకాలా రోబో డ్రెస్సులతో పవర్ రేంజర్స్ అంటూ సూపర్ హీరోలు ప్రపంచాన్ని కాపాడటం అప్పట్లో చాలా కొత్తగా, వింతగా ఉండటం, పిల్లలకు బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ సిరీస్ బాగా సక్సెస్ అయింది. పవర్ రేంజర్స్ కార్డ్స్ కూడా రాగా వాటితో గేమ్స్ ఆడుకునేవారు.
30 ఏళ్ళ చరిత్ర ఉన్న పవర్ రేంజర్స్ ఇప్పుడు మళ్ళీ తిరిగొస్తుంది. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం ఆగిపోయిన పవర్ రేంజర్స్ ని ఇప్పుడు మళ్ళీ నెట్ ఫ్లిక్స్(Netflix) పరిచయం చేయబోతుంది. అప్పుడు పవర్ రేంజర్స్ క్యారెక్టర్స్ చేసిన చిన్న పిల్లలు, యంగ్ ఏజ్ వాళ్ళే ఇప్పుడు పెద్దవాళ్లుగా మారగా వాళ్ళతోనే మళ్ళీ పవర్ రేంజర్స్ నిర్మించింది నెట్ ఫ్లిక్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ పవర్ రేంజర్స్ టీజర్ రిలీజ్ చేసింది. దీంతో ఈ టీజర్ వైరల్ గా మారింది. పవర్ రేంజర్స్ మళ్ళీ తిరిగొస్తుండటంతో 90s కిడ్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడు పవర్ రేంజర్స్ చేసిన నటులే ఇప్పుడు కూడా చేస్తున్నారు. రెడ్, బ్లాక్, బ్లూ, పింక్, ఎల్లో.. పవర్ రేంజర్స్ అవే క్యారెక్టర్స్ మళ్ళీ చేస్తున్నారు. అయితే గ్రీన్ రేంజర్ క్యారెక్టర్ చేసిన జాసన్ అనే నటుడు మాత్రం మరణించడంతో ఆ క్యారెక్టర్ ఈ సిరీస్ లో లేడు. టీం అంతా గ్రీన్ రేంజర్ కి ఈ సిరీస్ లో నివాళులు అర్పిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ కొత్త సిరీస్ లో మరిన్ని కొత్త క్యారెక్టర్స్ ని, కొత్త పవరే రేంజర్స్ ని కూడా తీసుకొచ్చినట్టు సమాచారం. ఈ సూపర్ హీరోలకి అప్పటి శత్రువే మళ్ళీ తిరిగొస్తే ఒక అమ్మాయిని, ప్రపంచాన్ని కాపాడటానికి ఈ పవర్ రేంజర్స్ ఏం చేశారు అనేదే కథలా ఉండబోతున్నట్టు టీజర్ చూస్తుంటే అర్ధమవుతుంది. మరి ఒకప్పుడు సూపర్ సక్సెస్ అయిన పవర్ రేంజర్స్ ఇప్పటి ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. 90s కిడ్స్ మాత్రం ఈ సరికొత్త పవర్ రేంజర్స్ సిరీస్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ పవర్ రేంజర్స్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 19 నుంచి ప్రీమియర్ కానుంది. Once a ranger, always a ranger! అనే స్లోగన్ తో నెట్ ఫ్లిక్స్ దీనిని ప్రచారం చేస్తుంది.
Once a ranger, always a ranger!
Mighty Morphin Power Rangers: Once & Always premieres April 19! pic.twitter.com/kEDrEr85EO
— Netflix (@netflix) March 22, 2023