సాహో: స్పెషల్ సాంగ్ కోసం హాలీవుడ్ బ్యూటీ

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఏ స్థాయికి పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ప్రభాస్ ప్రధాన పాత్రలలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ సాహో. ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్ గా రన్ రాజా రన్ ఫేం సుజీత్ తెరకెక్కిస్తున్నాడు. శ్రద్ధా కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. చిత్రానికి సంబంధించి విడుదలైన వీడియోలు ప్రేక్షకులలో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
దాదాపు 150 కోట్ల రూపాయలతో సాహో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వస్తుండగా ఇందులో నీల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే వంటి టాప్ స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం హాలీవుడ్ బ్యూటీని తీసుకువస్తున్నారట సాహో టీం.
పాప్ గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బ్రిటీష్ భామ కైలీ మినోగ్.. ‘సాహో’లో స్పెషల్ సాంగ్ లో నటించడానికి అంగీకరించిందట. దాదాపు పదేళ్ళ క్రితం అక్షయ్ నటించిన ‘బ్లూ’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. మళ్లీ ఇంతకాలానికి మరో ఇండియన్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కైలీ మినోగ్. ద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ‘సాహో’ ఈ ఏడాదిలో ఆగస్ట్ 15న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.