Hollywood stars Tom Cruise and Ana de Armas to get married in space
Tom Cruise-Ana de Armas: హాలీవుడ్ స్టార్ టాప్ క్రూజ్ గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. సినిమాల్లో ఆయన చేసే యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల కోసం ప్రాణం పెట్టేయడం అని పదానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ అంటే టామ్ క్రూజ్ అనే చెప్పాలి. బైక్ స్టంట్లు, ఫ్లైట్స్ నుంచి దూకేయడం, రియల్ స్టంట్లు చేయడంలో(Tom Cruise-Ana de Armas) ఆయన తోప్. మిషన్ ఇంపాజిబుల్ లాంటి సినిమాల్లో ఆయన యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 63 ఏళ్ళ వయసులో కూడా ఆయన చేసే స్టంట్లు ఒళ్ళు గగుర్పొడిపించడం ఖాయం.
అయితే, ఈ స్టార్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. అదేదో సినిమా గురించి కాదు.. పెళ్లి గురించి. అవును, 63 ఏళ్ళ లేట్ వయసులో మనోడు మళ్ళీ పెళ్ళికి సిద్దమయ్యాడట. అది కూడా తనలో సగం వయసులో హాలీవుడ్ స్టార్ బ్యూటీ అనా డి ఆర్మాస్ తో. అవును, చాలా కాలంగా ఈ జంట డేటింగ్ లో ఉన్నారట. ఇప్పుడు ఆ రిలేషన్ ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట. పెళ్లి రెడీ అవుతున్నారట. ఆ పెళ్లి కూడా ఆశామాషీగా కాకుండా ఏకంగా అంతరిక్షంలో చేసువుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.
తన సినిమాల మాదిరిగానే తన పెళ్లి గురించి కూడా జనాలు మాట్లాడుకోవాలని ఇలా ప్లాన్ చేస్తున్నాడట టామ్ క్రూజ్. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక టామ్ క్రూజ్ విషయానికి వస్తే, గతంలోనే ఆయనకు మూడు పెళ్లిళ్లు జరిగాయి. మొదట ఆయన మిమి రోజర్స్ ని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నాడు. ఆ తరువాత నికోల్ కిడ్‌మన్, కేటీ హోమ్స్ లను వివాహం చేసుకుని ఆపై విడాకులు ఇచ్చాడు. ఈ హీరోయికి ఇప్పటికే నలుగురు సంతానం ఉన్నారు. ఇక అనా డి ఆర్మాస్ కూడా గతంలో మార్క్ కొల్టేట్ అనే స్పానిష్ యాక్టర్‌ను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. ఆ తరువాత హాలీవుడ్ స్టార్ బెన్ అప్లెక్, క్యూబా అధ్యకుడి కుమారుడితో ప్రేమ వ్యవహారం నడిపింది. ఇప్పుడు తనకన్నా రెట్టింపు వయసున్న టామ్ క్రూజ్‌తో రెండో పెళ్లికి సిద్దమయ్యింది. మరి వీరి బంధం ఎంతకాలం వరకు ఉంటుందో చూడాలి.