Aishwarya Rai: దిమ్మతిరిగే షాకిచ్చిన ఐశ్వర్య.. యూట్యూబ్ పై రూ.4 కోట్ల పరువు నష్టం దావా.. చెప్పినప్పుడు వినాలిగా!
ఎలాంటి అనుమతి తమ లేకుండా ఫొటోలు వాడకూడదంటూ బాలీవుడ్ స్టార్ ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో కోర్టు కూడా ఆమెకు అనుకూలంగా తీర్పును అందించింది.

Aishwarya Rai files Rs 4 crore defamation suit against YouTube
Aishwarya Rai: ఎలాంటి అనుమతి తమ లేకుండా ఫొటోలు వాడకూడదంటూ బాలీవుడ్ స్టార్ ఐశ్వర్య రాయ్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో కోర్టు కూడా ఆమెకు అనుకూలంగా తీర్పును అందించింది. ఈ నేపధ్యంలోనే, ఐశ్వర్య మరోసారి కోర్టును ఆశ్రయించింది. వీడియో కంటెంట్ వేదిక అయిన యూట్యూబ్‌పై రూ.4 కోట్ల పరువు నష్టం దావా వేసింది. తమ అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు వాడటానికి (Aishwarya Rai)వాడకూడదని ఢిల్లీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఏఐతో క్రియేట్ చేసిన ఫొటోలు, వీడియోలు యూట్యూబ్ లో దర్శనమిస్తుండటంతో ఐశ్వర్య ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక ఐశ్వర్యరాయ్ ఫొటోలను అనుమతి లేకుండా వాడటం వల్ల ఆమెకు ఆర్థికంగా నష్టం కలిగించడమే కాకుండా.. గౌరవం, ప్రతిష్ఠ ను దెబ్బతీసినట్లే అవుతుందని ఢిల్లీ కోర్టు పేర్కొంది. ఆమె వ్యక్తిగత, ప్రచార హక్కులకు తాము రక్షణ కల్పిస్తామని కూడా స్పష్టం చేసింది కోర్టు. ఐశ్వర్య వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. వాటికి సంబందించిన యూఆర్‌ఎల్‌లను వెంటనే తొలగించి బ్లాక్ చేయాలని గూగుల్ సహా ఇ-కామర్స్ వైబ్‌సైట్‌లను, ఇతర ప్లాట్‌ఫార్మ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు అందిన 72 గంటల్లోపు ఆ యూఆర్‌ఎల్‌లను బ్లాక్ చేయాలని హచ్చరించింది. అయినప్పటికీ, ఓ యూట్యూబ్ ఛానల్‌లో ఐశ్వర్య వీడియోలు కనిపిస్తుండటంతో వారిపై దావా వేశారు.