Srinidhi Shetty: నాకు చెప్పిన కథ వేరు.. తీసిన సినిమా వేరు.. రెండేళ్ల ప్రయాణంలో చాలా మార్పులు.. ఇలాంటివి జరిగితేనే..!
హిట్ 3 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్రాండ్ (Srinidhi Shetty)ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ శ్రీనిధి శెట్టి. నాని హీరోగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. క్రైం థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది.

Srinidhi's interesting comments on the movie Telusu kada
Srinidhi Shetty: హిట్ 3 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ శ్రీనిధి శెట్టి. నాని హీరోగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. క్రైం థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. అలాగే, హీరోయిన్ శ్రీనిధికి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. దాంతో, తెలుగులో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి. అందులో భాగంగానే, ప్రస్తుతం ఆమె తెలుగులో చేస్తున్న సినిమా “తెలుసు కదా”. (Srinidhi Shetty)స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకురాలు నీరజ కోనా తెరకెక్కిస్తుండగా రాశి ఖన్నా మరో హీరోయిన్ గా నటిస్తోంది.
Samantha: పండగ పూట ‘కొత్త ప్రయాణం’.. రెండో పెళ్లి గురించి హింట్ ఇచ్చిందా.. ఇక అన్నీ అక్కడినుంచే!
ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో, ఈ సినిమా రిలీజ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పనుల్లో బిజీ అయ్యారు మూవీ టీం. ఇందులో భాగంగానే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనిధి శెట్టి తెలుసు కదా సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
“తెలుసు కదా సినిమా కోసం ముందు నాకు చెప్పిన కథ వేరు. ఫైనల్ చేసిన సినిమా వేరు. దాదాపు రెండేళ్ల క్రితం నేను ఈ కథ విన్నాను. కథలోని ఎమోషనల్ కంటెంట్ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాం. కానీ, ఈ ప్రాసెస్ లో చాలా మార్పులు వచ్చాయి. క్రియేటీవ్ పరంగా, టెక్నీకల్ పరంగా చాలా మార్పులు జరిగాయి. వాటికి అనుగుణంగా కథను మార్చారు. ఫైనల్ అవుట్ ఫుట్ చాలా కొత్తగా వచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమాను అందరికీ నచ్చుతుంది” అంటూ చెప్పుకొచ్చింది శ్రీనిధి. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.