Samantha: పండగ పూట ‘కొత్త ప్రయాణం’.. రెండో పెళ్లి గురించి హింట్ ఇచ్చిందా.. ఇక అన్నీ అక్కడినుంచే!
దసరా పండగ వేళ తన ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సౌత్ బ్యూటీ సమంత(Samantha). ‘కొత్త ప్రయాణం’ అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసింది.

Samantha Ruth Prabhu buys a new house during the festival
Samantha: దసరా పండగ వేళ తన ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సౌత్ బ్యూటీ సమంత. ‘కొత్త ప్రయాణం’ అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసింది. దాంతో, ఏంటా కొత్త ప్రయాణం అని తెలుసుకోవడానికి ఆడియన్స్,ఫ్యాన్స్, నెటిజన్స్ చాలా ఆసక్తి చూపించారు. దానికి కారణం, ఇటీవల ఆమె రెండో పెళ్లి గురించి న్యూస్ వైరల్ అవుతుండటమే. ఇందులో భాగంగానే, సామ్ కొత్త ప్రయాణం అంటూ పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది(Samantha).
Tamannaah Bhatia: సినిమాల వల్ల కాదా.. ఏంటి తమన్నా అంత మాట అనేసావ్.. మరి నీ ఫ్యాన్స్ సంగతి ఏంటి?
ఇంతకీ ఆ కొత్త ప్రయాణం దేని గురించో కాదు. సమంత రీసెంట్ తన కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యింది. ఆ కొత్తింటి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే ఇది ముందు గోడపై తన నిక్‌నేమ్ సామ్ (SAM) అనే లోగోను ఏర్పాటు చేసింది. దాంతో ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది. అయితే, సమంత ఈ హైదరాబాద్‌లో కొనుగోలు చేశారా? ముంబయిలోనా? అని తెలియాల్సి ఉంది. ఇక సమంత రెండో వివాహం విషయానికి వస్తే, ఆమె గత కొంత కాలంగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ తో డేటింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మధ్య జరిగిన చాలా ఈవెంట్స్ కి ఈ ఇద్దరూ జంటగా వెళుతూ మీడియా కంట పడ్డారు.
ఇక అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య ఎదో ఉందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక ఈ ఇద్దరు కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ లాంటి సిరీస్ కోసం వర్క్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారింది అని టాక్. ఇందులో భాగంగానే, ఈ ఇద్దరు కలిసి కొత్త ఇంట్లో అడుగుపెట్టబోతున్నారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తుంన్నాయి. మరి ఆ విషయంపై సామ్ ఏదైనా ప్రకటన చేస్తుందా అనేది చూడాలి. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్, మా ఇంటి బంగారం అనే సినిమాలు చేస్తోంది. ఈ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.