KGF 3 : చరిత్ర సృష్టించిన KGF 2కు వన్ ఇయర్.. పార్ట్ 3పై అప్డేట్ ఇచ్చిన హోంబలె ఫిలిమ్స్..

KGF 2 సినిమా గత సంవత్సరం ఏప్రిల్ 14న రిలీజయి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమా వచ్చి నేటికి సంవత్సరం పూర్తయింది. KGF 2 సినిమా చివర్లోనే దీనికి కూడా సీక్వెల్ ఉంటుందని KGF 3 హింట్ ఇచ్చి వదిలేశారు.

Hombale Films gives clarity on KGF 3

KGF 3 :  యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ నుంచి వచ్చిన KGF సినిమా భారీ విజయం సాధించి KGF 2 పై భారీ అంచనాలని పెంచింది. దీంతో KGF 2 రిలీజయిన తర్వాత పెద్ద హిట్ అయింది. కన్నడలో మాత్రమే కాకుండా దేశమంతటా పెద్ద విజయం సాధించి ఏకంగా 1000 కోట్ల కలెక్షన్స్ సాధించి కన్నడ సినీ పరిశ్రమ రూపురేఖలను మార్చేసింది KGF 2 సినిమా.

సినిమా కథకు, సినిమాలోని ఎలివేషన్స్ కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాతో యశ్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇక ప్రశాంత్ నీల్ అయితే వరుసగా స్టార్స్ తో సినిమాలు పట్టేశాడు. KGF 2 సినిమా గత సంవత్సరం ఏప్రిల్ 14న రిలీజయి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమా వచ్చి నేటికి సంవత్సరం పూర్తయింది. KGF 2 సినిమా చివర్లోనే దీనికి కూడా సీక్వెల్ ఉంటుందని KGF 3 హింట్ ఇచ్చి వదిలేశారు. దీంతో యశ్ అభిమానులు, ఈ సినిమా అభిమానులు KGF 3 ఎప్పుడు ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే పలు సార్లు KGF 3 పై రకరకాల వార్తలు వినిపించినా అధికారికంగా నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరో వైపు యశ్ ఇంకా అతని నెక్స్ట్ సినిమా ఓకే చేయలేదు. తాజాగా KGF 2 రిలీజయి సంవత్సరం అయిన నేపథ్యంలో నిర్మాణసంస్థ ఓ స్పెషల్ వీడియోని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియోలో 1971 నుంచి 1981 వరకు రాఖీ భాయ్ ఏమైపోయాడు అనే ప్రశ్న వేసి, చివర్లో రాఖీ భాయ్ ప్రామిస్ ఇచ్చాడు, ప్రామిస్ తీరుస్తాడు అని KGF 2 సినిమాలోని చివరి సీన్ KGF 3 అని చూపించే షాట్ వేసి 3 అని వేశారు.

Dil Raju : దిల్ రాజు పాన్ ఇండియా టార్గెట్.. సౌత్ సినిమాలతోనే..

దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. హోంబలే ఫిలిమ్స్ ఇలా అధికారికంగా వీడియో పోస్ట్ చేసి రాఖీ భాయ్ ప్రామిస్ నిలుపుకుంటాడు అని, KGF 3 అని వీడియోలో చూపించడంతో అభిమానులు KGF 3 త్వరలో రానుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వరుసగా ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి KGF 3 రావాల్సిందంటే ఇవి అయిన తర్వాతేనా? లేక ప్రభాస్ సినిమా తర్వాత మళ్ళీ KGF 3 మొదలుపెడతారా చూడాలి. సినిమా ఎప్పుడు ఉన్నా, ఎంత లేట్ అయినా KGF 3 మాత్రం కచ్చితంగా ఉంటుందని చిత్ర నిర్మాణ సంస్థ నేడు క్లారిటీ ఇచ్చేసింది.