Home Town Teaser : ఆకట్టుకుంటోన్న ‘హోం టౌన్’ టీజర్.. 100కి 116 మార్కులు..
హోం టౌన్ టీజర్‌ను విడుదల చేశారు.

Home Town Teaser
ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైవిధ్యమైన కథాంశాలతో, కుటుంబమంతా కలిసి చూసే సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు అందిస్తూ ఆడియన్స్ ను అలరిస్తోంది. తాజాగా మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ‘హోం టౌన్’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. నవీన్ మేడారం, శేఖర్ మేడారం సంయుక్తంగా నిర్మించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సైరమ్, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించారు.
ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 4 నుంచి ఆహోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టారు.
అందులో భాగంగా తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ‘కలలు ప్రారంభమయ్యే ప్రాంతం.. మొదటి ప్రేమను అనుభవించే చోటు.. ఎప్పటికీ నిలిచిపోయే స్నేహం’ అంటూ విడదీయరాని స్నేహాలు, కుటుంబ విలువలు తెలిసేలా దీన్ని రూపొందిచినట్లుగా అర్థమవుతోంది. మొత్తంగా టీజర్ ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రసాద్ పాత్రలో రాజీవ్ కనకాల నటించారు.