Oscars 2026: ఆస్కార్స్ 2026.. భారత్ నుంచి నామినేట్ అయిన మూవీ ఇదే.. ఏ కేటగిరీలో అంటే..
దర్శకుడు నీరజ్ గ్యావన్ కూడా ఈ గుర్తింపు పట్ల తన ఆనందాన్ని పంచుకున్నారు.

Oscars 2026: నీరజ్ గ్యావన్ దర్శకత్వం వహించిన ‘హోమ్‌బౌండ్’ 2026లో జరగనున్న 98వ అస్కార్స్ కు నామినేట్ అయ్యింది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ కేటగిరీలో ఈ చిత్రం అఫీషియల్ గా నామినేట్ అయ్యింది. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. పోలీస్ అవ్వాలనుకునే ఇద్దరు మిత్రులకు ఎదురైన సవాళ్లే ఈ సినిమా స్టోరీ. ఈ ఏడాది కేన్స్, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించగా దీనికి అద్భుత స్పందన వచ్చింది. ఈ మూవీ ఈ నెల 26న థియేటర్లలో విడుదల కానుంది.
దీనిపై కరణ్ జోహార్ స్పందించారు. తన ఆనందాన్ని పంచుకున్నారు. “అకాడమీ అవార్డులకు భారత్ అధికారిక ఎంట్రీగా HOMEBOUND ఎంపిక కావడం మాకు చాలా గౌరవంగా, మరెంతో హ్యాపీగా ఉంది. నీరజ్ గ్యావన్ శ్రమకు గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది హృదయాలలో ఆయన చోటు సంపాదించడం ఖాయం” అని కరణ్ అన్నారు.
ఈ చిత్ర నిర్మాత ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆనందాన్ని పంచుకున్నారు. తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన మైలురాళ్లలో ఒకటిగా దీన్ని అభివర్ణించారు. “నేను ఎప్పటికీ మర్చిపోలేను. 98వ అకాడమీ అవార్డులలో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌గా భారత్ అధికారిక ఎంట్రీగా మా #Homebound చిత్రం ఎంపిక కావడం చాలా గౌరవంగా, మరెంతో ఆనందంగా ఉంది. మొత్తం బృందానికి హృదయపూర్వక అభినందనలు” అని తెలిపారు.
దర్శకుడు నీరజ్ గ్యావన్ కూడా ఈ గుర్తింపు పట్ల తన ఆనందాన్ని పంచుకున్నారు. “హోమ్‌బౌండ్ ఆస్కార్స్ కు భారత్ అధికారిక ఎంట్రీగా ఎంపిక కావడం నాకు చాలా గౌరవంగా ఉంది. అతిపెద్ద ప్రపంచ వేదికలో భారత్ కు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం” అని ఆయన అన్నారు.