Homebound movie becomes official entry for 2026 Oscars
Oscar 2026: బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా వస్తున్న లేటెస్ట్ మూవీ “హోమ్ బౌండ్”. విడుదలకు ముందే ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా ఇండియా నుంచి అధికారికంగా ఆస్కార్-2026(Oscar 2026) లోకి ఎంట్రీ సాధించింది. ఈ విషయాన్నీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నీరజ్ గేవాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీతో పటు ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా కీలక పాత్రలు పోషించారు.
Mirai: మిరాయ్ మేకర్స్ కి షాక్.. నా కథను కాపీ చేశారు.. హైకోర్టులో పిటీషన్ వేసిన రచయిత
అయితే, ఇప్పటికే ఈ సినిమా పలు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటిన విషయం తెలిసిందే. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో కూడా ఈ సినిమాను ప్రదర్శించారు. కరణ్ జోహార్, అదార్ పూనావాలా, సోమెన్ మిశ్రా, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 26న విడుదల కానుంది.