Horror Film Erra Cheera Movie Release Date Announced
Erra Cheera : శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న సినిమా ‘ఎర్రచీర – ది బిగినింగ్. NVV సుబ్బారెడ్డి నిర్మాణంలో సుమన్ బాబు దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ మనవరాలు సాయి తేజస్విని, శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు.. పలువురు ముఖ్య పాత్రల్లో ఎర్రచీర సినిమా తెరకెక్కిస్తున్నారు.
Also Read : 8 Vasantalu : ‘8 వసంతాలు’ గ్లింప్స్ రిలీజ్.. మార్షల్ ఆర్ట్స్‌తో అదరగొట్టబోతున్న అనంతిక..
తాజాగా నేడు దసరా సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఎర్రచీర సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పూర్తి చేసుకుంది. సినిమాలో 45 నిమషాల పాటు కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ ఉండనున్నాయి. మదర్ సెంటిమెంట్ తో హార్రర్ సినిమాగా తెరకెక్కించాము. సినిమా క్లైమాక్స్ లో మదర్ సెంటిమెంట్ ప్రేక్షకులను కన్నీరు పెట్టిస్తుంది అని తెలిపారు.