హాం ఫట్.. అలియా భట్ : ‘భూత్ రాజా’ వీడియో సాంగ్

అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, రానా దగ్గుబాటి, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే తదితరులు నటించిన ‘హౌస్‌ఫుల్ 4’ దివాళీ కానుకగా అక్టోబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది..

  • Published By: sekhar ,Published On : October 16, 2019 / 12:17 PM IST
హాం ఫట్.. అలియా భట్ : ‘భూత్ రాజా’ వీడియో సాంగ్

Updated On : October 16, 2019 / 12:17 PM IST

అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, రానా దగ్గుబాటి, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే తదితరులు నటించిన ‘హౌస్‌ఫుల్ 4’ దివాళీ కానుకగా అక్టోబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది..

‘హౌస్‌ఫుల్’ ఫ్రాంచైజీలో వస్తున్న ‘హౌస్‌ఫుల్ 4’ విడుదలకు సిద్ధమవుతుంది. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, రానా దగ్గుబాటి, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే మెయిన్ లీడ్స్‌గా నటించగా.. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను.. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో, సాజిద్ నడియాడ్ వాలా నిర్మించారు. సినిమా రిలీజ్‌కి తక్కువ టైమ్ ఉండడంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ ఫుల్ స్పీడ్‌‌‌తో జరుపుతుంది.

ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రోమోస్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా ‘భూత్ రాజా’ అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ మాంత్రికుడిగా కనిపించిన ఈ పాటలో సినిమాలోని మెయిన్ లీడ్స్ అందరూ సందడి చేశారు. ‘హాం ఫట్.. అలియా భట్’ అంటూ నవాజుద్దీన్.. అక్షయ్ కుమార్‌కి పట్టిన భూతాన్ని వదిలించడానికి ప్రయత్నించడం… నాలోపల ఎలాంటి భూతం లేదు అని అక్షయ్ వేడుకోవడం.. ఇలా ఫన్నీగా ఉందీ వీడియో సాంగ్..

Read Also : ప్రతీ ఫోన్‌లో ఓ సీక్రెట్ ఉంటుంది : ‘మీకు మాత్రమే చెప్తా’ ట్రైలర్

డైరెక్టర్ ఫర్హాద్ సామ్జీ లిరిక్స్ రాయగా, మికా సింగ్, ఫర్హాద్ సామ్జీ కలిసి పాడారు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారు. అమంద రోసారియో, చుంకీ పాండే, బొమన్ ఇరానీ, జానీ లివర్, పరేష్ రావెల్, రాజ్‌పాల్ యాదవ్, ప్రదీప్ రావత్, సౌరభ్ శుక్లా ఇతర పాత్రల్లో నటించిన ‘హౌస్‌ఫుల్ 4’ దివాళీ కానుకగా అక్టోబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.