బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ డ్యాన్స్ ఇరగదీస్తాడని మనందరికీ తెలిసిన విషయమే. హృతిక్ సినిమా విడుదలవుతుందంటే చాలు కేవలం డ్యాన్స్, యాక్టింగ్ చూడ్డానికి మాత్రమే థియేటర్లకు వెళ్తారు. మరి అంత పెద్ద డ్యాన్సర్ కు మరొకరి డ్యాన్స్ నచ్చడం అంటే చిన్న విషయం కాదు.. మరి డ్యాన్స్ తో హ్రితిక్ మనసు దోచుకున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా?
వివరాలు.. ఓ టిక్ టాక్ యూజర్ చేసిన డ్యాన్స్ వీడియో చూసి హ్రితిక్ ఫిదా అయ్యాడు. ఎయిర్ వాకర్ స్టైల్ లో ఆ కుర్రాడు చేసిన డ్యాన్స్ వీడియో చూస్తే.. నిజంగానే ఎవరికైనా నచ్చుతుంది. పాదాలను గాల్లో తేలిపోయినట్టుగా స్టెప్పులేస్తున్న కుర్రాడి డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయిన ఓ ట్విటర్ యూజర్ ఆ వీడియోను హృతిక్ రోషన్ తో పాటు ప్రభుదేవాకు ట్విటర్ లో ట్యాగ్ చేశాడు. అంతేకాదు ఈ డ్యాన్సర్ ని పాపులర్ చేయాల్సిందిగా కోరాడు.
నెటిజెన్ ట్యాగ్ చేసిన ఆ వీడియో చూసిన హృతిక్ రోషన్.. ఇంత స్మూత్ గా ఎయిర్ వాక్ చేస్తుండగా చూడటం ఇదే మొదటిసారి.. అసలు ఎవరు ఇతను అని తన ట్విట్ చేశాడు. ఈ కుర్రాడు తన పేరును ట్విట్టర్ లో బాబా జాక్సన్ 2020 అని పెట్టుకున్నాడు. కానీ అతడి అసలు పేరు యువరాజ్ సింగ్ అని.. అతడికి టిక్ టాక్ లో దాదాపు ఓ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారని తెలిసింది. ఇది చూసి మొత్తానికి హృతిక్ రోషన్ కంట్లో పడ్డాడు..ఇక అతడి కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయినట్టే అంటున్నారు నెటిజెన్స్.
Smoothest airwalker I have seen. Who is this man ? https://t.co/HojQdJowMD
— Hrithik Roshan (@iHrithik) January 13, 2020