Fighter Twitter Review : హృతిక్ రోషన్ ‘ఫైటర్’ పబ్లిక్ టాక్ ఏంటి..? ట్విట్టర్ రివ్యూ ఎలా ఉంది..?

హృతిక్ రోషన్, దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ‘ఫైటర్’ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ టాక్ ఏంటి..?

Hrithik Roshan Deepika Padukone Fighter movie twitter review and public talk

Fighter Twitter Review : బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ కాంబో నుంచి ‘వార్’, ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమాల తరువాత ఆడియన్స్ ముందుకు వస్తున్న సినిమా ‘ఫైటర్’. దీపికా పదుకోన్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, టెర్రరిస్ట్, దేశభక్తి వంటి అంశాలతో రూపొందింది. రిపబ్లిక్ డే కానుకగా ఈ చిత్రం నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది.

అయితే ‘వార్’, ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమాల తెలుగులో కూడా రిలీజ్ చేసిన మేకర్స్.. ఈ సినిమాని మాత్రం కేవలం హిందీలోనే రిలీజ్ చేశారు. మరి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుందో తెలియాలంటే ట్విట్టర్ రివ్యూ చూడాల్సిందే. ఈ మూవీ చూసిన చాలామంది ఆడియన్స్ సూపర్ అంటూ త్రీ స్టార్ పైనే రేటింగ్ ఇస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయిలో సినిమా ఉందని పేర్కొంటున్నారు.

Also read : Animal : యానిమల్ ఓటీటీ రిలీజ్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..

మూవీలో యాక్ట్ చేసిన నటీనటుల పర్ఫార్మెన్స్ అదిరిపోయిందంటూ పేర్కొన్నారు. స్టోరీ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉందని, ఇక యాక్షన్ సీక్వెన్స్ అయితే ఏరియల్ యాక్షన్ మూవీస్‌లో.. ఇది బెస్ట్ గా నిలుస్తుందని పేర్కొంటున్నారు.

దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ మరోసారి హృతిక్ బ్లాక్ బస్టర్ ని అందించారంటూ, హ్యాట్రిక్ కాంబో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దేశభక్తిని, యాక్షన్ ని సిద్దార్థ్ చాలా చక్కగా బ్యాలన్స్ చేశాడంటూ చెప్పుకొస్తున్నారు. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సన్నివేశాలు అయితే గూస్‌బంప్స్ తెప్పిస్తాయంటూ, ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ కి వచ్చేలా చేస్తాయంటూ చెబుతున్నారు.