Animal : యానిమల్ ఓటీటీ రిలీజ్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..
యానిమల్ ఓటీటీ రిలీజ్ డేట్ ని అఫీషియల్ అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్.

Sandeep Reddy Vanga Ranbir Kapoor Animal Movie ott release date announced officially
Animal : టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ ని ఆల్ఫా మేల్ క్యారెక్టర్ లో బోల్డ్ అండ్ వైల్డ్ గా చూపిస్తూ తెరకెక్కించిన సినిమా ‘యానిమల్’. ఫాదర్ సెంటిమెంట్ ని సరికొత్తగా ప్రెజెంట్ చేస్తూ రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ హీరోయిన్స్ గా నటించగా అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. గత ఏడాది డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 900 కోట్ల కలెక్షన్స్ ని నమోదు చేసింది.
ఇక ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసిన ఆడియన్స్ కూడా ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఓటీటీలో మరో 8 నిమిషాల అదనపు సీన్స్ తో 3 గంటల 29 నిమిషాల రన్ టైంతో స్ట్రీమ్ కాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో ఆ ఎక్స్‌ట్రా రన్ టైములో ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయో అని ఆడియన్స్ లో ఆసక్తి నెలకుంది. ఇక ఈ ఆసక్తి నెట్‌ఫ్లిక్స్ తెరదించబోతుంది.
Also read : పెళ్లి తాంబూలాలు వీడియో షేర్ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ శోభాశెట్టి..
ఈ మూవీని జనవరి 26న అంటే రేపు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ టీం అధికారికంగా ప్రకటించింది. ఈరోజు అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ మొదలు కాబోతుంది. మరి ఎక్స్‌ట్రా సీన్స్ ఏంటో ఈరోజు నైట్‌కే చూసేయండి. అలాగే ఈ మూవీని థియేటర్స్ లో మిస్ అయ్యినవారు కూడా ఈ చిత్రాన్ని ఇప్పుడు చూసి ఎంజాయ్ చేసేయండి.
The air is dense and the temperature is rising. ??
Witness his wild rage in Animal, streaming from 26 January on Netflix in Hindi, Tamil, Telugu, Malayalam and Kannada. #AnimalOnNetflix pic.twitter.com/ituQvrT9kS— Netflix India (@NetflixIndia) January 25, 2024