Fighter : హృతిక్ రోషన్ ‘ఫైటర్’ అనౌన్స్.. పఠాన్ డైరెక్టర్ తో..

సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా అనిల్ కపూర్ ముఖ్య పాత్రలో భారత వాయు సేన నేపథ్యంలో ఫైటర్ సినిమా తెరకెక్కబోతుంది.

Hrithik Roshan Fighter Movie under Siddharth Anand Direction announced

Fighter Movie : బాలీవుడ్(Bollywood) లో వార్(War), పఠాన్(Pathaan) లాంటి యాక్షన్ సినిమాలతో మెప్పించిన డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్(Siddharth Anand) ఇప్పుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి ఫైటర్(Fighter) అనే సినిమాతో రాబోతున్నాడు. హృతిక్ – సిద్దార్థ్ కాంబోలో వార్ తర్వాత ఇంకో ప్రాజెక్టు ఉందని గతంలోనే ప్రకటించారు. తాజాగా ఆ ప్రాజెక్టుని అనౌన్స్ చేస్తూ పూర్తి డీటెయిల్స్ ని ప్రకటించారు.

సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా అనిల్ కపూర్ ముఖ్య పాత్రలో భారత వాయు సేన నేపథ్యంలో ఫైటర్ సినిమా తెరకెక్కబోతుంది. ఇక ఈ సినిమాని 2024 జనవరి 25న రిలీజ్ చేస్తామని ప్రకటించేశారు. తాజాగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాని వియాకామ్ 18 స్టూడియోస్ భారీగా నిర్మిస్తుంది.

Bholaa Shankar : భోళా శంకర్ తెలుగులో అయిపోయింది.. హిందీలో రిలీజ్‌కి రెడీ.. మెగాస్టార్‌కి డబ్బింగ్ ఎవరో తెలుసా?

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ఈ సినిమా కుడా పాన్ ఇండియా రిలీజ్ కానుంది. పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత సిద్దార్థ్ నుంచి వచ్చే సినిమా, వార్ తర్వాత హృతిక్ సిద్దార్థ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఫైటర్ పై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి.