Site icon 10TV Telugu

Hrithik Roshan : నా బ్రదర్ ఎన్టీఆర్.. మీరంతా నాకు ప్రామిస్ చేయాలి.. షూట్ లో ఎన్టీఆర్ ని చూసి నొప్పితోనే..

Hrithik Roshan Interesting Comments on NTR War 2 Pre Release Event

Hrithik Roshan

Hrithik Roshan : : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబోలో బాలీవుడ్ లో భారీగా తెరకెక్కుతున్న స్పై సినిమా వార్ 2 ఆగస్టు 14న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. నేడు వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. భారీగా అభిమానుల మధ్య ఈవెంట్ ని నిర్వహించారు.

ఈ ఈవెంట్ కి హృతిక్ రోషన్ కూడా హాజరయ్యారు. హృతిక్, ఎన్టీఆర్ లకు స్టేజిపైకి భారీగా ఫైర్ క్రాకర్స్ తో వెల్కమ్ చెప్పారు.

Also Read : NTR Full Speech : ఇది ఎన్టీఆర్ హిందీకి వెళ్లిన సినిమా కాదు.. నన్ను ఎవరూ ఆపలేరు.. కాలర్ ఎత్తి 25 ఇయర్స్ ఎన్టీఆర్ స్పెషల్ స్పీచ్..

ఈ ఈవెంట్లో హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. లాస్ట్ టైం క్రిష్ సినిమా షూటింగ్ కి హైదరాబాద్ వచ్చాను. తెలుగు ప్రజల ప్రేమ మర్చిపోలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చాను. నాలుగు రోజుల్లో సినిమా రానుంది. ఎన్టీఆర్, నేను కో స్టార్స్ గా మొదలు పెట్టాము. బ్రదర్స్ గా సినిమాని ముగించాము. మీరంతా నాకు ఒక ప్రామిస్ ఇవ్వాలి. మీరంతా నా బ్రదర్ ని ఇలాగే జీవితాంతం ప్రేమించాలి. నేను చేసిన అన్ని సినిమాల పైన వార్ 2 ఉంటుంది. నాకు చాలా గాయాలు అయ్యాయి ఈ షూటింగ్ లో. కానీ ఎన్టీఆర్ ని చూసి ఇతను ఎలా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాడు అనుకునేవాడిని. ఎన్టీఆర్ ని చూసి అదే నొప్పితో నేను షూట్ కి రెడీ అనేవాడ్ని. నేను తారక్ చాలా విషయాల్లో ఒకటే. ఎన్టీఆర్ సింగిల్ షాట్ ఆర్టిస్ట్. నేను ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్నాను షాట్ లో వంద శాతం ఎలా లీనమవ్వాలి అని. ఎన్టీఆర్ తన షాట్ చెక్ చేసుకోడు ఎందుకంటే వంద శాతం ఇస్తాడు. ఎన్టీఆర్ గొప్ప చెఫ్. చాలా గొప్ప ఫుడ్ చేస్తాడు. మనం కలిసి మళ్ళీ సినిమా చేస్తామో లేదో నేను నీ బిర్యానీ మళ్ళీ మళ్ళీ తినాలి అని అన్నారు.

Also Read : Ram Charan – Brahmanandam : హాస్యబ్రహ్మతో గ్లోబల్ స్టార్.. బ్రహ్మానందం ఫ్యామిలీని కలిసిన చరణ్.. ఫోటోలు వైరల్..

Exit mobile version