NTR Full Speech : ఇది ఎన్టీఆర్ హిందీకి వెళ్లిన సినిమా కాదు.. నన్ను ఎవరూ ఆపలేరు.. కాలర్ ఎత్తి 25 ఇయర్స్ ఎన్టీఆర్ స్పెషల్ స్పీచ్..
ఎన్టీఆర్ కూడా మొదటి బాలీవుడ్ సినిమా, 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా స్పెషల్ గా స్పీచ్ ఇచ్చారు.

NTR Full Speech
NTR Full Speech : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబోలో బాలీవుడ్ లో భారీగా తెరకెక్కుతున్న స్పై సినిమా వార్ 2 ఆగస్టు 14న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. నేడు వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. భారీగా అభిమానుల మధ్య ఈవెంట్ ని నిర్వహించారు.
ఈ ఈవెంట్ కి హృతిక్ రోషన్ కూడా వచ్చారు. ఎన్టీఆర్ ఈ సంవత్సరంతో 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో మరింత గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించారు. దీంతో ఎన్టీఆర్ కూడా మొదటి బాలీవుడ్ సినిమా, 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా స్పెషల్ గా స్పీచ్ ఇచ్చారు.
ఎన్టీఆర్ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఇప్పటిదాకా వర్షం పడలేదు. మీరెక్కడ తడుస్తారో అని భయంగా ఉంది. ఈ పండగ చేయడానికి నాగవంశీ బాగా బలవంత పెట్టాడు. గతంలో బాద్ షా ఈవెంట్ అప్పుడు ఓ అభిమాని ప్రాణం కోల్పోయాడు తొక్కిసలాటలో. అప్పట్నుంచి బహిరంగ ఈవెంట్స్ కి దూరంగా ఉంటున్నాను. వార్ 2 నేను చేయడానికి ముఖ్య కారణం ఆదిత్య చోప్రా. నా వెంట పడి నా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సినిమా ఇస్తాను అని చెప్పి ఈ సినిమా ఒప్పించారు. నాకు ముంబై అంటే ఇష్టం ఉండదు. కానీ అక్కడ 70 రోజులు ఉండేలా చేసి ఇంట్లో ఉన్నాను అనేలా చూసుకున్నారు YRF స్టూడియోస్.
డైరెక్టర్ అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ కి నేను రావాల్సి ఉంది. కానీ కుదరక రాలేదు. అయాన్ కూడా ఆ ఈవెంట్ కి రాలేదు. డెస్టినీ ఇవాళ నా దర్శకుడిగా వచ్చాడు. వార్ 2 ని అయాన్ తీసినంత గొప్పగా ఇండియాలో ఏ డైరెక్టర్ తీయలేడు. అయాన్ నాకు, హృతిక్ కి గైడ్ గా ఉన్నాడు సెట్స్ లో. నా కంటికి మైఖేల్ జాక్సన్ తప్ప ఎవరూ ఆనేవాళ్ళు కాదు. హృతిక్ డ్యాన్స్ చూసి మెస్మరైజ్ అయ్యాను. ఇండియాలో ఫైనెస్ట్, డెడికేటెడ్ యాక్టర్ హృతిక్ రోషన్. నేను ఆయన్నిఅభిమానించాను. నేను నటుడిగా అయ్యాక 25 ఏళ్ళ తర్వాత ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చింది. ఆయన డ్యాన్స్ చూసి ప్రేరణ పొందిన నేను ఆయనతో డ్యాన్స్ చేయడం నా అదృష్టం. హృతిక్ రోషన్ ఈ దేశంలో గొప్ప డ్యాన్సర్. ఈ సినిమాలో సాంగ్ ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ కాదు. ఇది ఇద్దరు డ్యాన్సర్లు కలిసి చేసింది. నాకు మీ డ్యాన్స్ నచ్చింది. కానీ మనకంటే గొప్పగా చేసే వాళ్ళు ఉన్నారు ఒప్పుకోవాలి. 75 రోజులు ఆయనతో కలిసి పనిచేసి చాలా నేర్చుకున్నా. రాజమౌళి సౌత్, నార్త్ బౌండరీస్ తీసేసారు. కానీ అక్కడ మమ్మల్ని యాక్సెప్ట్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తారు. కానీ హృతిక్ నన్ను యాక్సెప్ట్ చేసారు.
ఇది అందరూ అన్నట్టు ఎన్టీఆర్ హిందీకి వెళ్లిన సినిమా కాదు. హృతిక్ తెలుగుకు వచ్చిన సినిమా. నా అభిమానులు హృతిక్ ని కూడా దగ్గరికి తీసుకుంటారు. 25 ఏళ్ళ క్రితం నిన్ను చూడాలని సినిమాతో నా కెరీర్ మొదలైంది. రామోజీరావు గారు నన్ను పరిచయం చేసారు. ఆ మూవీ ఓపెనింగ్ ఫంక్షన్ కి వెళ్ళినపుడు నా పక్కన మా నాన్న, అమ్మ తప్ప ఎవరూ లేరు. ఏం జరుగుతుందో తెలీదు నాకు. నా మొదటి అభిమాని ముజీబ్ అని ఉంటాడు. నా ఆఫీస్ కి వచ్చి నా ఫ్యాన్ అన్నాడు. నా సినిమా ఒక్కటి కూడా రిలీజ్ అవ్వలేదు అప్పుడే ఫ్యాన్ ఏంటి అన్నాను. నా వెంటే ఉంటాను అన్నాడు. ముజీబ్ తర్వాత చాలా మంది అభిమానులు వచ్చారు.
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారకరామారావు ఆశీస్సులు ఉన్నంత కాలం నన్ను ఎవరూ ఆపలేరు. సపోర్ట్ చేసిన్నఫ్యామిలీ, నిర్మాతలు, దర్శకులు, ఫ్యాన్స్, మీడియా అందరికి పాదాభివందనం. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను కడుపులో పెట్టుకొని నేను చేసిన తప్పుల్నీ క్షమిస్తూ నా భాధలో మీరు నాతో పాటు కన్నీళ్లు కార్చి నా ఆనందంలో మీరు పంచుకొని నా కోసం మీరు కోరిన ప్రార్థనలకు ఎన్ని జన్మలెత్తినా మీ ఋణం తీర్చుకోలేను. మా నాన్నకు చెప్పాను కొడుకుగా మీరు జన్మ ఇచ్చారు. కానీ ఈ జీవితం మీకే అంకితమని. ఈ జన్మకు ఇది చాలు. ఇంతకంటే ఇంకేమి వద్దు. జీవితాంతం మిమ్మల్ని ఆనందంగా ఉంచుతాను. దేవుడు చల్లగా చూస్తే మీ అందరితో ముందుకు వెళ్తాను ఇంకొన్నాళ్ళు. ఎవరెన్ని మాట్లాడుకున్నా పర్లేదు బొమ్మ అదిరిపోయింది, పండగ చేసుకోండి అంటూ రెండు కాలర్స్ ఎత్తారు. సినిమాలో ట్విస్టులు మాత్రం బయటకు చెప్పకండి. సక్సెస్ మీట్ లో కలుస్తాను. త్వరలోనే ఫ్యాన్స్ తో ఫొటో సెషన్ పెట్టుకుందాం అని అన్నారు ఎన్టీఆర్. దీంతో ఎన్టీఆర్ స్పీచ్ వైరల్ గా మారింది.
Also Read : Athamma`s Kitchen : అత్తమ్మాస్ కిచెన్ ఎలా మొదలైందో తెలుసా? చరణ్ అర్ధరాత్రి వచ్చి అలా అడుగుతుండటంతో..