Site icon 10TV Telugu

Hrithik Roshan : వెన్ను సమస్య.. నత్తి ఉంది.. డ్యాన్స్ చేయొద్దు అన్నారు.. కట్ చేస్తే స్టార్ హీరో, ఇండియా బెస్ట్ డ్యాన్సర్స్ లో ఒకరు..

Hrithik Roshan Tells about his Spine Issues and battarism how he overcome it

Hrithik Roshan : సినీ సెలబ్రిటీలు అయినా ఎన్నో కష్టాలు పడే ఇప్పుడున్న స్టేజ్ కి చేరుకుంటారు. అలా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఎంత స్టార్స్ ఫ్యామిలీ నుంచి వచ్చినా తాను కూడా కష్టపడ్డాను అని చెప్పాడు. ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హృతిక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం తెలిపాడు.

హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. నేను కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు వెన్ను సమస్య రావడంతో డాక్టర్లు నేను డ్యాన్స్ చేయకూడదు అన్నారు. కానీ నాకేమో సినిమాల్లోకి వెళ్లాలని ఉండేది. అదే విషయం చెప్తే కష్టం ఇంకోసారి ఆలోచించుకో అన్నారు. నేను దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని శారీరికంగా, మానసికంగా నన్ను నేను రెడీ చేసుకున్నాను అని తెలిపాడు. ఇవాళ ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్ లో ఒకరిగా హృతిక్ నిలిచాడు.

Also Read : Upasana : పెళ్లి తర్వాత ఇంట్లో అలా తింటుంటే అందరూ నన్నే చూసారు.. అప్పట్నుంచి మామయ్య చెప్పింది ఫాలో అవుతున్నా..

అలాగే.. చిన్నతనంలో నాకు నత్తి ఉండేది. స్కూల్ లో అందరూ ఆటపట్టించేవారు. నేను ఇంటికొచ్చి ఏడ్చేవాడ్ని. నటుడు అవ్వాలని అనుకునే నా లాంటి వాళ్లకు నత్తి చాలా పెద్ద సమస్య. అది పోగొట్టుకోడానికి రోజూ ఉదయం నాలుగింటికి నిద్రలేచి స్పీచ్ క్లాసులకు వెళ్ళేవాడిని. చాలా కష్టపడి ఆ సమస్య నుంచి బయటపడ్డాను అని తెలిపాడు హృతిక్.

Exit mobile version