×
Ad

Hrithik Roshan: ఒక చిత్రహింసలా.. ఒక గాయంలా.. వార్ 2 రిజల్ట్ పై మొదటిసారి స్పందించిన హ్రితిక్

బాలీవుడ్ స్టార్ హ్రితిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ (Hrithik Roshan)వార్ 2. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Hrithik Roshan's shocking comments on War 2 movie results

Hrithik Roshan: బాలీవుడ్ స్టార్ హ్రితిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన (Hrithik Roshan)లేటెస్ట్ మూవీ వార్ 2. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ సక్సెస్ తరువాత ఎన్టీఆర్ బాలీవుడ్ లో చేసిన సినిమా కావడంతో వార్ 2పై భారీ అంచనాల క్రియేట్ అయ్యాయి. కానీ, విడుదల తరువాత మాత్రం ఆడియన్స్ నుంచి డిజాస్టర్ టాక్ వచ్చింది. అసలు ఏమాత్రం ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం రూ.250 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఈ ఇయర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

Hero: ఒకప్పుడు నిర్మాతకు కారు డ్రైవర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఆఫీస్ బాయ్ గా చేసిన ఈ హీరో కథ మీకు తెలుసా?

అయితే తాజాగా వార్ 2 సినిమా గురించి, ఆ సినిమా సాధించిన రిజల్ట్ గురించి మొదటిసారి స్పందించాడు హ్రితిక్ రోషన్. సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. “వార్‌ 2 సినిమాలో కబీర్ పాత్ర చేయడం సరదాగా అనిపించింది. సినిమా మొత్తం చాలా రిలాక్స్‌డ్‌గా, ఎలాంటి టెన్షన్ లేకుండా పూర్తి చేశాను. ఒక నటుడిగా నేను సినిమా కోసం ఏం చేయాలో అది చేశాను. దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అతను ఎప్పుడూ చాలా ఎనర్జీగా ఉంటాడు. సినిమా చేస్తున్నప్పుడు మాకు ప్రతిదీ చాలా పరిపూర్ణంగా అనిపించింది. కానీ, వెనుక నుంచి మమ్మల్ని ఏదో పదే పదే ఆపుతున్న శబ్ధం వినిపించేది. కానీ, ప్రతి సినిమా ఒక చిత్రహింసలా, ఒక గాయంలా ఫీలవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ రిలాక్స్” అంటూ రాసుకొచ్చాడు హ్రితిక్ రోషన్. దీంతో ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.