Hero: ఒకప్పుడు నిర్మాతకు కారు డ్రైవర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఆఫీస్ బాయ్ గా చేసిన ఈ హీరో కథ మీకు తెలుసా?
సినిమా రంగం అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ రాణించాలని చాలా మందికి(Hero) ఆశ ఉంటుంది. కానీ, ఆ అదృష్టం ఎప్పుడు.. ఎవరికి.. ఎలా కలిసి వస్తుందో చెప్పడం చాలా కష్టం.

Hero Rishab Shetty worked as a car driver for a producer
Hero: సినిమా రంగం అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ రాణించాలని చాలా మందికి ఆశ ఉంటుంది. కానీ, ఆ అదృష్టం ఎప్పుడు.. ఎవరికి.. ఎలా కలిసి వస్తుందో చెప్పడం చాలా కష్టం. మన వంతుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే విజయం దానంతట అదే వస్తుంది అని ఇప్పటికే చాలా మంది స్టార్స్ నిరూపించారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం టాలెంట్ తో పైకొచ్చిన స్టార్స్ కూడా చాలా మంది ఉన్నారు. వారిలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఒకరు. ఇండస్ట్రీలో(Hero) ఎలాంటి సంబంధాలు లేకుండా కేవలం తన కష్టం, కసితోనే ఇంతటి విజయాన్ని సాధించాడు. రీసెంట్ గా ఆయన తన కొత్త సినిమా కాంతార: చాఫ్టర్ 1 సినిమా ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్ళాడు. అక్కడ తనకు ముంబైతో ఉన్న అనుబంధం గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “ముంబై సిటీతో నాకు చాలా ప్రత్యేకణమైన అనుబంధం ఉంది. 2008లో నేను అంధేరి వెస్ట్ ఉండేవాడిని. అక్కడ ఒక నిర్మాణ సంస్థలో ఆఫీస్ బాయ్ గా పని చేశాను. అలాగే, ఆ నిర్మాతకు కారు డ్రైవర్ గా కూడా చేశాను. కానీ, కేవలం ఒక్క సినిమాతో నాకు ఇంత గుర్తింపు వస్తుంది అని ఎప్పడూ ఊహించలేదు. ఇక్కడే రోడ్డు పక్కన వడ పాప్ తిన్నప్పుడు కూడా అనుకోలేదు. నేను ఈ స్థాయికి చేరుకుంటాను అని”అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. దీంతో, రిషబ్ శెట్టిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి. నువ్వు గ్రేట్ రిషబ్ భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక కాంతార: చాఫ్టర్ 1 సినిమా విషయానికి వస్తే, 2022లో వచ్చిన సూపర్ హిట్ కాంతార సినిమాకు సీక్వెల్ గా వచ్చింది ఈ సినిమా. దాంతో ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే నెక్స్ట్ లెవల్లో సినిమాను ప్రెజెంట్ చేశాడు రిషబ్ శెట్టి. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో, మొదటిరోజు ఏకంగా రూ.89 కోట్ల గ్రస్స్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక సినిమాకు యునానిమస్ గా పాజిటీవ్ టాక్ రావడంతో రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.