×
Ad

Mass Jathara : రవితేజ ‘మాస్ జాతర’ నుంచి మెలోడి సాంగ్‌.. ‘హుడియో హుడియో’ విడుద‌ల

భాను భోగ‌వ‌ర‌పు ద‌ర్శ‌క‌త్వంలో మాస్ మహారాజా ర‌వితేజ న‌టిస్తున్న మాస్ జాత‌ర‌ (Mass Jathara) నుంచి హుడియో హుడియో పాట‌ను విడుద‌ల చేశారు.

Hudiyo Hudiyo Lyrical from Ravi Teja Mass Jathara movie

Mass Jathara : మాస్ మహారాజా ర‌వితేజ న‌టిస్తున్న చిత్రం మాస్ జాత‌ర‌. భాను భోగ‌వ‌ర‌పు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల క‌థానాయిక‌. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ 31 ఈ చిత్రం (Mass Jathara) ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది.

అందులో భాగంగా ఈ చిత్రంలోని పాట‌ల‌ను ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు పాట‌లు ‘తు మేరా లవర్’, ‘ఓలే ఓలే’ పాట‌ల‌ను విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది.

Kannada stars : లక్కీ హీరోయిన్స్ గా కన్నడ స్టార్స్

తాజాగా మూడో పాట‌ను ‘హుడియో హుడియో’ అనే మెలోడీని విడుద‌ల చేశారు. భీమ్స్ సిసిరోలియో అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. దేవ్ సాహిత్యాన్ని అందించ‌గా హేషమ్ అబ్దుల్ వహాబ్, భీమ్స్ క‌లిసి ఈ పాట‌ను పాడారు.