Kannada stars : లక్కీ హీరోయిన్స్ గా కన్నడ స్టార్స్
కన్నడ సినిమా నుంచి వచ్చిన హీరోయిన్లు (Kannada stars) టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు

Gossip Garage Kannada stars as lucky heroines
Kannada stars : కన్నడ సినిమా నుంచి వచ్చిన హీరోయిన్లు టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. కాంతారా చాప్టర్-1తో ఇటీవలే మరో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన రుక్మిణి వసంత్, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి.. ఇద్దరూ వరుసగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు సైన్ చేస్తూ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, స్టార్ హీరోల దృష్టిని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇద్దరూ లక్కీ హీరోయిన్స్‌గా పేరు తెచ్చుకున్నారు. వీళ్ల డేట్స్ కోసం ఎన్టీఆర్, నాని, సిద్ధు జోన్నలగడ్డ వంటి టాప్ హీరోల టీమ్స్ వెయిటింగ్‌లో ఉన్నాయని సినీ వర్గాల్లో గాసిప్ చక్కర్లు కొడుతోంది.
ఎన్టీఆర్ డ్రాగన్ మూవీతో రుక్మిణి వసంత్‌కు టాలీవుడ్ బిగ్ ఎంట్రీ దక్కింది. సప్త సాగరదాటి సినిమాతో యూత్‌లో క్రేజ్ సంపాదించింది. కాంతారా చాప్టర్-1లో ఆమెకు ఇంకా గుర్తింపు దక్కింది. ప్రిన్సెస్ కనకవతిగా రుక్మిణి పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. కాంతార చాప్టర్-1 సక్సెస్‌తో రుక్మిణి టాలీవుడ్‌లో ‘హాట్ ఫేవరెట్’ అయిపోయింది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయింది. ఆమె డేట్స్ కోసం టాలీవుడ్ హీరోలు వెయిట్ చేస్తున్నారట.
Varun Sandesh : ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి.. కానిస్టేబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వరుణ్ సందేశ్..
శ్రీనిధి శెట్టి హిట్-3 సక్సెస్‌తో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు తెలుసు కదా మూవీ రిలీజ్ కాబోతోంది. కేజీఎఫ్ చాప్టర్-1, 2తో పాన్-ఇండియా స్టార్ హీరోయిన్‌గా ఫ్యాన్ బేస్‌ను సంపాందించింది శ్రీనిధి శెట్టి. మోడల్ నుంచి యాక్టర్‌గా మారి టాలీవుడ్‌లో తన మార్క్ చూపిస్తోంది. ఆమె టాలెంట్, లుక్స్, యాక్టింగ్..అన్నింటికి మించి సక్సెస్ సెంటిమెంట్‌తో టాలీవుడ్‌లో బిజీ అవుతోంది శ్రీనిధి. ఈ ముద్దుగుమ్మ డేట్స్ కోసం స్టార్ హీరోలు వెయిట్ అనే టాక్ వినిపిస్తుంది.