ఆర్ఆర్ఆర్ : ఎన్టీఆర్ ఇంట్రోకి అంతఖర్చా?

ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ కోసం భారీ బడ్జెట్..

  • Publish Date - April 18, 2019 / 11:16 AM IST

ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ కోసం భారీ బడ్జెట్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ గురించి ఒక లేటెస్ట్ అప్‌డేట్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ కోసం భారీ బడ్జెట్ కేటాయించారట. కేవలం ఇంట్రో కోసమే దాదాపు రూ.22 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఈ సినిమా కోసం జక్కన్న టాప్ టెక్నీషియన్స్‌ని సెలెక్ట్ చేస్తున్నాడు.

లైఫ్ ఆఫ్ పై, జంగిల్ బుక్ వంటి సినిమాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ నిపుణులు ఆర్ఆర్ఆర్ సినిమాకి పనిచెయ్యనున్నారు. ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటున్న చిత్ర యూనిట్ మరికొద్ది రోజుల్లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చెయ్యనుంది. 2020 లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి కెమెరా : సెంథిల్ కుమార్, సంగీతం : ఎమ్ఎమ్ కీరవాణి.