Pushpa 2 Security : హైదరాబాద్ పుష్ప 2 ఈవెంట్.. మొదటిసారి 1000 మంది పోలీసులతో భద్రత..
నేడు పుష్ప 2 హైప్ ని దృష్టిలో పెట్టుకొని భారీగా అభిమానులు వస్తారని అంచనా వేసి బందోబస్త్ మరింత పెంచారు.

Huge Police Security at Allu Arjun Pushpa 2 Hyderabad Event
Pushpa 2 Security : అల్లు అర్జున్ పుష్ప 2 ప్రమోషన్స్ పాన్ ఇండియా లెవల్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబైలలో పుష్ప 2 ఈవెంట్స్ గ్రాండ్ గా ప్లాన్ చేసారు. నేడు ఈ ఈవెంట్ హైదరాబాద్ లో జరగనుంది. హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నేడు రాత్రి పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది.
సాధారణంగా ఆ గ్రౌండ్ లో సినిమా ఈవెంట్ జరిగితే కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు, పోలీస్ బందోబస్త్ ఉంటుంది. సాధారణంగా గతంలో జరిగిన ఈవెంట్స్ కు 200 నుంచి 500 మంది వరకు ట్రాఫిక్, నార్మల్ పోలీసులు బందోబస్త్ చేసారు.
Also Read : Pushpa Srivalli : పుష్ప 2 సినిమాలో శ్రీవల్లి పాత్ర చనిపోతుందా?
అయితే నేడు పుష్ప 2 హైప్ ని దృష్టిలో పెట్టుకొని భారీగా అభిమానులు వస్తారని అంచనా వేసి బందోబస్త్ మరింత పెంచారు. ఇప్పటికే ఆ రోడ్ బ్లాక్ చేసి ట్రాఫిక్ డైవర్షన్స్ చేయగా ఆ ఈవెంట్ కు దాదాపు 1000 మంది పోలీసులు బందోబస్తుగా వచ్చారని తెలుస్తుంది. దీంతో ఆ ఏరియా అంతా పోలీసులతో నిండిపోయింది. ఈవెంట్ ని, ఈవెంట్ చుట్టు పక్క ప్రదేశాలు అన్ని పోలీసుల కనుసన్నల్లోనే ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, భారీగా వస్తున్న క్రౌడ్ ని కంట్రోల్ చేసేందుకే ఇంతమంది పోలీసులు వచ్చారని తెలుస్తుంది.
1000 మంది పోలీసులు బందోబస్త్ అంటే పుష్ప హవా అని బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పోలీసులు వచ్చి ఈవెంట్ వద్ద తమ విధుల్లో జాయిన్ అవుతున్న వీడియోలు వైరల్ గా మారాయి.