Pushpa Srivalli : పుష్ప 2 సినిమాలో శ్రీవల్లి పాత్ర చనిపోతుందా?

టీజర్, ట్రైలర్స్ తో సినిమా కంటెంట్ ని, కథని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.

Pushpa Srivalli : పుష్ప 2 సినిమాలో శ్రీవల్లి పాత్ర చనిపోతుందా?

Interesting News about Srivalli Character in Pushpa 2 Movie goes Viral

Updated On : December 2, 2024 / 4:16 PM IST

Pushpa Srivalli : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. డిసెంబర్ 5 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా వైడ్ చేస్తున్నారు. నేడు హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ జరగనుంది.

ఇప్పటికే రిలీజయిన టీజర్, ట్రైలర్స్ తో సినిమా కంటెంట్ ని, కథని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ తో పుష్ప 2 కథ.. గంధపు చెక్కల వ్యాపారంలో పుష్ప ఇంకా ఎదిగి ఎంపీ సిద్దప్పను, మంగళం శ్రీనుని కూడా పట్టించుకోకుండా తనే ఇంటర్నేషనల్ డీలింగ్స్ చేస్తాడని, వాళ్ళని పట్టించుకోకపోవడంతో వాళ్ళు పుష్పకు వ్యతిరేకంగా మారతారని, మరోవైపు భన్వర్ సింగ్ షెకావత్ పుష్పపై పగ తీర్చుకోడానికి ఎదురుచూస్తాడని, ఇక పెళ్లి తర్వాత శ్రీవల్లితో హ్యాపీగా కాపురం చేసుకుంటాడని తెలుస్తుంది. పుష్ప పాత్రను ఇంటర్నేషనల్ గా తీసుకెళ్లినా క్లైమాక్స్ భన్వర్ సింగ్ షెకావత్ తోనే పెడతారని భావిస్తున్నారు.

Also Read : Pushpa 2 : అప్పుడు సామీ.. ఇప్పుడు పీలింగ్స్.. సాంగ్స్ కోసం ఫోక్ సింగర్స్ ను తీసుకొచ్చిన సుకుమార్..

అయితే ఈ సినిమాలో శ్రీవల్లి పాత్ర చనిపోతుంది తెలుస్తుంది. పార్ట్ 1లో శ్రీవల్లి తన బలహీనత అని ఇండైరెక్ట్ గా చెప్పేసారు. పార్ట్ 2 నుంచి ఇటీవల వచ్చిన ట్రైలర్ లో కూడా శ్రీవల్లి బాధపడుతూ పుష్ప గురించి డైలాగ్ చెప్తుంది. దీంతో పుష్ప శత్రువులు శ్రీవల్లిని చంపేస్తారని అనుకుంటున్నారు. అలాగే ట్రైలర్ లో ఒక షాట్ లో వర్షంలో గంధపు చెక్కల మీద ఒక శవాన్ని తగలబెట్టినట్టు చూపించారు. అక్కడ పుష్పతో పాటు చాలా మంది ఉంటారు. ఆ ప్రాంతం అంతా జనాలతో నిండిపోయి ఉంటుంది. దీంతో శ్రీవల్లి చనిపోతే శ్రీవల్లికి అంత్యక్రియలు చేసాడని నెటిజన్లు అంటున్నారు. ఇలా పలు అంచనాలు వేస్తూ శ్రీవల్లి పాత్రని చంపేస్తారని అంటున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే తెరపై చూడాల్సిందే.