huge pre release business for Prabhas Salaar Ceasefire
Salaar : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో సినిమా వస్తుంది అంటే దాని పై అంచనాలు భారీగా ఉండడం సహజమే. అయితే ఇటీవల రిలీజ్ అయిన టీజర్ తో ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామంటూ ప్రకంటించి సంచలనం సృష్టించారు. ఇక మొదటి భాగాన్ని ‘Ceasefire’ పేరుతో సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఇలా ఉంటే, ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో పలుకుతున్నట్లు ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది.
Ram Charan : RC16 గురించి వైరల్ అవుతున్న వార్తలు.. విజయ్ సేతుపతి..!
టీజర్ లో ప్రభాస్ తో డైలాగ్ చెప్పించకపోగా, పేస్ ని కూడా సరిగ్గా చూపించలేదు. అయినా సరి యూట్యూబ్ లో టీజర్ సంచలనాలు సృష్టించింది. ఇక ఈ క్రేజ్ తోనే కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సలార్ 200 కోట్ల థియేట్రికల్ రైట్స్ పలుకుతున్నట్లు సమాచారం. ఆంధ్రాలో 90 కోట్లు, నైజంలో 72 కోట్లు, సీడెడ్ లో 35 కోట్ల వరకు పలుకుతున్నట్లు తెలుస్తుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 200 కోట్ల వరకు ధర పలుకుతున్నాయంటే.. ఓవర్ ఆల్ ఇండియా, ఓవర్ సీస్ మరియు డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ తో కలిపి ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 500 కోట్లు క్రాస్ చేయడం పక్కా అంటున్నారు.
Raviteja : మాసివ్ కాంబో బ్యాక్.. రవితేజ, గోపీచంద్ మలినేని సినిమా అనౌన్స్.. క్రాక్ 2..?
కాగా ఈ సినిమాని హోంబలే ఫిల్మ్స్ దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా కనిపించబోతున్నారు. శ్రియా రెడ్డి, టిన్ను ఆనంద్, ఈశ్వరి రావు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఆగష్టులో ఈ మూవీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ఇటీవల అనౌన్స్ చేశారు.