Pushpa 2 Ticket Price : వామ్మో అక్కడ పుష్ప 2 టికెట్ రేట్ అంతా.. ఇక్కడే 1200 అంటే అక్కడ ఇంకా ఎక్కువే..

మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక చాలా చోట్ల పుష్ప 2 టికెట్ రేట్లు భారీగానే పెంచినట్టు తెలుస్తుంది.

Huge Ticket Prices for Pushpa 2 Movie all Over India

Pushpa 2 Ticket Price : అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలిజ్ కానుంది. ఇప్పటికే చాలా చోట్ల బుకింగ్స్ కూడా ఓపెన్ అవ్వడంతో ఫ్యాన్స్ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. నార్త్ లో కూడా పుష్ప 2 సినిమాకు మంచి బుకింగ్స్ అవుతున్నాయి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక చాలా చోట్ల పుష్ప 2 టికెట్ రేట్లు భారీగానే పెంచినట్టు తెలుస్తుంది.

తెలంగాణలో బెన్ఫిట్ షో అధికారికంగానే సింగిల్ స్క్రీన్స్ లో 1100 పైన, మల్టీప్లెక్స్ లో 1200 పైన ఉంది. దీంతో ఈ రేట్లు చూసి నార్మల్ ఆడియన్స్ షాక్ అవుతున్నారు. ఇవే ఎక్కువ అనుకుంటే ఢిల్లీ, ముంబై, బెంగుళూరులోని కొన్ని మాల్స్ లో ఇంతకంటే ఎక్కువ రేట్లు ఉన్నాయట. సాధారణంగానే ఢిల్లీ, ముంబై, బెంగుళూరులోని ఖరీదైన మాల్స్ లో ఏ సినిమా టికెట్ రేటు అయినా 1000 నుంచి 2000 మధ్య ఉంటుంది. అయితే పుష్ప 2 టికెట్ రేటు 2000 కూడా దాటేసింది. బెంగుళూరులోని చాలా ఖరీదైన మాల్స్ లో పుష్ప 2 టికెట్ రేటు గరిష్టంగా 1800 నుంచి 2000 వరకు ఉందట.

Also Read : Nidhhi Agerwal : ‘సీజ్ ది షిప్’.. హరిహర వీరమల్లు పై నిధి అగర్వాల్ అదిరిపోయే పోస్ట్..

ఢిల్లీలోని PVR మల్టీప్లెక్స్ థియేటర్స్ లో 2400 వరకు టికెట్ రేటు ఉందట. అలాగే ముంబైలోని చాలా మల్టీప్లెక్స్ లలో 2100 నుంచి స్టార్టింగ్ రేట్ ఉందట. ఇక ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ థియేటర్ లో అయితే పుష్ప 2 టికెట్ 3000 రూపాయలు ఉందని తెలుస్తుంది. దీంతో ఇక్కడే ఎక్కువ అనుకుంటే అక్కడ ఏంటి మరీ అంత ఉన్నాయ్ టికెట్ రేట్లు అని ఆశ్చర్యపోతున్నారు.