×
Ad

Raghuram Dhruvan: “హంగ్రీ చీటా” సాంగ్ రాసిన మ్యూజిక్ సెన్సేషన్.. ట్రెండీ సాంగ్స్ కి కేరాఫ్.. ఇంతకీ ఎవరీ ద్రువన్?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా, విన్నా పవన్ కళ్యాణ్ ఓజీ మ్యానియా నడుస్తోంది. ఇటీవల(Raghuram Dhruvan) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది.

Hungry cheetah lisycist raghuram druvan name trending in tollywood

Raghuram Dhruvan: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా, విన్నా పవన్ కళ్యాణ్ ఓజీ మ్యానియా నడుస్తోంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన సూపర్ కావడంతో ఫ్యాన్స్, ఆడియన్స్ ఫుల్ పండగ చేసుకుంటున్నారు. అయితే, ఓజీ సినిమా విజయంలో మ్యూజిక్ చాలా పెద్ద పాత్ర పోషించింది. తమన్ తన ఎలక్ట్రిఫయింగ్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు(Raghuram Dhruvan). ఆడియన్స్ చొక్కాలు చించుకునేలా చేశాడు. మరీ ముఖ్యంగా సినిమాలో వచ్చే హంగ్రీ చీటా అనే సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Mirai: సినీ లవర్స్ కి పండుగ ఆఫర్.. మిరాయ్ టికెట్స్ రేట్స్ భారీగా తగ్గింపు

నెత్తురుకు మరిగిన హంగ్రీ చీటా.. శత్రువును ఎంచితే మొదలు వేట.. చూపు గాని విసిరితే ఓర కంట.. డెత్ కోటా కన్ఫిర్మ్ అంట” అంటూ ఆ సాంగ్ లిరిక్స్ గూజ్ బంప్స్ తెప్పించాయి. ఇంత పవర్ ఫుల్ గా ఉన్న ఈ లిరిక్స్ రాసిన రైటర్ ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు టాలీవుడ్ లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ రఘురామ్ ధృవన్. కానీ, ఓజీ క్రెడిట్స్ లో మాత్రం ధృవన్ అని మాత్రమే ఉంటుంది. దాంతో, ఎవరీ ధృవన్ అని తెలుసుకోవడానికి ఆడియన్స్ ప్రయత్నించారు.

రఘురామ్ ధృవన్ కేవలం ఓజీలోనే కాదు గతంలోనే మంచి చాట్ బస్టర్ హిట్స్ కి లిరిక్స్ అందించాడు. వాటిలో.. సాయి దుర్గ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలో నో పెళ్లి, హే ఇది నేనేనా అనే సాంగ్స్.. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమాలో రాధే రాధే అనే సాంగ్.. స్కంద సినిమాలో నీ చుట్టు చుట్టు.. మ్యాడ్ లో ప్రౌడ్ సే సింగిల్.. లియో లో నే రెడీ.. గని సినిమాలో రోమియోకి జూలియెట్టులా లాంటి చాట్ బస్టర్ సాంగ్స్ కి లిరిక్స్ అందించాడు. కేవలం, లిరిక్ రైటర్ గానే కాదు మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రఘురామ్ ద్రువన్. ఉషా పరిణయం, లంబసింగి వంటి సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు.

ఇక తాజాగా ఆయన మ్యూజిక్ అందిస్తున్న లేటెస్ట్ మూవీ మిత్ర మండలి. ప్రియదర్శి హీరోగా వస్తున్న ఈ సినిమాలో త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాకి కూడా అదిరిపోయే మ్యూజిక్ అందించాడు రఘురామ్ ద్రువన్. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన “జంబర్ గింబర్ లాలా” అనే పాట సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీల్స్ లో ఎక్కడ చూసినా ఈ పాటనే వినపడుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.