Rajasaab: ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. సంక్రాంతి రేస్ నుంచి రాజాసాబ్ అవుట్? .. ఇంకా ఎన్నిసార్లు..

రాజాసాబ్ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. (Rajasaab)కారణం ఏంటంటే, రాజాసాబ్ సినిమా భారీ గ్రాఫిక్స్ తో కూడుకున్నది.

Rajasaab: ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. సంక్రాంతి రేస్ నుంచి రాజాసాబ్ అవుట్? .. ఇంకా ఎన్నిసార్లు..

Will Prabhas Raja Saab movie be postponed again?

Updated On : November 3, 2025 / 2:52 PM IST

Rajasaab: ఈమధ్య కాలంలో సినిమాలు చేయడం కాదు.. వాటిని అనుకున్న డేట్ కి తీసుకురావడం కూడా కష్టం అయిపొయింది. దాదాపు అన్ని సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బాహుబలి సినిమా నుంచి మొదలైన ఈ తంతు ఇంకా ఆ తరువాత వచ్చిన అన్నీ సినిమాలకు కొనసాగింది. నెక్స్ట్ రాబోతున్న రాజాసాబ్ కి కూడా కంటిన్యూ అవుతోంది. (Rajasaab)తాజా సమాచారం ప్రకారం రాజాసాబ్ మరోసారి వాయిదా పడినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Shah Rukh Khna: కాపీ “కింగ్” అంటున్నారు.. ఒకటి కాదు.. ఏకంగా మూడు సినిమాల నుంచి..

ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాను ముందుగా 2025 సమ్మర్లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ, ప్రభాస్ అప్పటికే ఒప్పుకున్న సినిమాల విడుదలలో జాప్యం జరగడం వల్ల అది కుదరలేదు. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకొని సెప్టెంబర్ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, ఆ సమయంలో ఓజీ విడుదల ఉండటంతో క్లాష్ వద్దనుకోని 2026 సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. జనవరి 9 డేట్ ను అధికారికంగా కూడా ప్రకటించారు. ట్రైలర్ కూడా విడుదల చేశార. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు.

కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజాసాబ్ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కారణం ఏంటంటే, రాజాసాబ్ సినిమా భారీ గ్రాఫిక్స్ తో కూడుకున్నది. ఈ సినిమాలో మొత్తం 3000 లకు పైగా సీజీ షాట్స్ ఉన్నాయట. ఆ షాట్స్ కి సంబందించిన వర్క్ ఇంకా పెండింగ్ లోనే ఉందట. ఫైనల్ వెర్షన్ వచ్చేసరికి ఇంకా ఆలస్యం కానుందట. అందుకే, ఈ సినిమాను సంక్రాంతి రేస్ నుంచి తప్పించాలను చూస్తున్నారట మేకర్స్. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. ఇంకా ఎన్నిసార్లు ఇలా వాయిదాలు వేస్తూ ఉంటారన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.