Chandini Chowdary : చాందినీ చౌదరి కొత్త సినిమా.. తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా లాంచ్..
తాజాగా మరో కొత్త సినిమా మొదలుపెట్టింది చాందినీ చౌదరి.(Chandini Chowdary)
Chandini Chowdary
Chandini Chowdary : తెలుగమ్మాయి చాందిని చౌదరి వరుసగా డిఫరెంట్ కథలతో, కొత్త కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే సంతాన ప్రాప్తిరస్తు అనే సినిమాతో రానుంది. తాజాగా మరో కొత్త సినిమా మొదలుపెట్టింది. చాందినీ చౌదరి, సుశాంత్ యాష్కీ మెయిన్ లీడ్స్ లో కొత్త సినిమా తెరకెక్కనుంది. సహచారి క్రియేషన్స్ బ్యానర్‌పై సృజన గోపాల్ నిర్మాణంలో వికాస్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానర్ లో ఈ సినిమా ఉండనుంది. నేడు ఈ కొత్త సినిమా పూజ కార్యక్రమం జరిగింది.(Chandini Chowdary)
ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ క్లాప్ కొట్టి ఈ సినిమాని ప్రారంభించాడు. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. సహచారి ప్రొడక్షన్ 2 లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ కాన్సెప్ట్ విన్నాను. చాలా యూనిక్ కాన్సెప్ట్ తో వస్తున్నారు అని అన్నారు.
Also Read : Vishnupriya : విష్ణుప్రియ మొదటి సంపాదన ఎంతో తెలుసా? ఇండస్ట్రీలోకి రాకపోతే ఆ పని చేసేదంట..
మూవీ లాంచ్ అనంతరం నిర్మాత సృజన గోపాల్ మాట్లాడుతూ.. సహచారి క్రియేషన్స్ సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త కాన్సెప్ట్ ని పరిచయం చేయబోతుంది. సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానెర్లో ఆడియన్స్ కి ఒక కొత్త అనుభవం ఇవ్వబోతున్నాం. ఎవరూ ఊహించని ఒక సూపర్ హీరోని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నాము. ఈ సినిమా కాన్సెప్ట్ వీడియోను త్వరలోనే విడుదల చేస్తాము. నవంబర్ చివరిలో హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభం కానుంది అని తెలిపారు.

ఈ సినిమాలో జీవన్ కుమార్, అజయ్ గోష్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read : Sudheer Babu : అయ్యో.. ఇప్పటిదాకా మహేష్ ని బావ అని పిలవలేదంట.. పిలిస్తే.. సుధీర్ బాబు కామెంట్స్ వైరల్..
