Music Director : పెళ్లి వద్దు.. కానీ హీరో అవుతానంటున్న మ్యూజిక్ డైరెక్టర్..
ఇప్పుడు మరో మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా మారబోతున్నాడు.(Music Director)
Music Director
Music Director : సినీ పరిశ్రమలో అదృష్టం కలిసొస్తే ఎవరైనా హీరో అవ్వొచ్చు. పరిశ్రమలో ఏ క్రాఫ్ట్ లో ఉన్నా నటించే ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు. తెలుగులో గతంలో ఆర్పీ పట్నాయక్ హీరోగా, దర్శకుడిగా సినిమాలు చేసారు. తమన్ కూడా నటుడిగా సినిమాలు చేసారు. త్వరలో ఓ సినిమా కూడా చేయబోతున్నాడు. ఇప్పుడు మరో మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా మారబోతున్నాడు.(Music Director)
ఇంతకీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. 26 ఏళ్లుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మెప్పించిన దేవిశ్రీ ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే దేవిశ్రీ ప్రసాద్ హీరోగా మారే అవకాశం ఉందట. ఇటీవల బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ సినిమాలో దేవిశ్రీ నటిస్తాడని వార్తలు కూడా వచ్చాయి.
Also Read : Vishnupriya : విష్ణుప్రియ మొదటి సంపాదన ఎంతో తెలుసా? ఇండస్ట్రీలోకి రాకపోతే ఆ పని చేసేదంట..
తాజాగా జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా షోకి దేవిశ్రీ ప్రసాద్ రాగా పెళ్లి చేసుకుంటావా? హీరో అవుతావా అనే ప్రశ్న అడిగారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సమాధానమిస్తూ.. పెళ్లి ఆప్షన్ పక్కన పెడితే.. పెళ్లి పక్కన ఇంకేం పెట్టినా అదే సెలెక్ట్ చేసుకుంటాను. కాబట్టి హీరోనే అవుతాను. అయినా నేను హీరో అవుతానేమో. చాలా కథలు వస్తున్నాయి. వింటున్నాను. నాకు కథ నచ్చితే తప్పకుండా హీరోగా సినిమా చేస్తాను అని తెలిపాడు.
తన సంగీతంతో మెస్మరైజ్ చేసే డీఎస్పీ గతంలో పలు సినిమాల్లో తెరపై పాటల మధ్యలో మెరిపించాడు. మరి హీరోగా ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇస్తాడో చూడాలి.
Also Read : Vishnupriya : మూడేళ్ళ వయసులో అమ్మనాన్న విడిపోయారు.. నాన్నతో మాట్లాడటం అమ్మకు ఇష్టం లేదు.. అమ్మ చనిపోయాక..
