OG Movie : పవన్ కళ్యాణ్ OG మూవీ నుంచి ‘హంగ్రీ చీతా’ సాంగ్ రిలీజ్..

పవన్ కళ్యాణ్ OG మూవీ నుంచి హంగ్రీ చీతా సాంగ్ రిలీజ్ అయ్యింది.

Hungry Cheetah lyrical song release from Pawan Kalyan OG Movie

OG Movie : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘OG’. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. కాగా నిన్న సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి గ్లింప్స్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ టీజర్ ని థమన్ ఇచ్చిన మ్యూజిక్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ‘హంగ్రీ చీతా’ అనే ఫుల్ సౌండ్ ట్రాక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అంటూ అభిమానులు నుంచి మేకర్స్ రిక్వెస్ట్ లు కూడా వెళ్లాయి.

NTR : ఆ పాత్రకు న్యాయం చేయగల నటుడు ఒక ఎన్టీఆర్ మాత్రమే.. బాలీవుడ్ దర్శకుడు..!

తాజాగా చిత్ర యూనిట్.. అభిమానుల కోరిక మేరకు ఆ సౌండ్ ట్రాక్ ని రిలీజ్ చేశారు. దీంతో అభిమానులంతా ఆ సాంగ్ ని డౌన్లోడ్ చేసి తమ ప్లే లిస్ట్ లో యాడ్ చేసేస్తున్నారు. కాగా ఈ మూవీ చిత్రీకరణ ఎండింగ్ కి వచ్చేసింది. మరో రెండు షెడ్యూల్స్ తో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అవ్వనున్నట్లు తెలుస్తుంది. 2024 సంక్రాంతి బరిలో ఈ మూవీ నిలిచే అవకాశం కూడా ఉండవచ్చని చెబుతున్నారు. మరి పవన్ బాక్స్ ఆఫీస్ పై ఎప్పుడు దాడి చేస్తాడో చూడాలి. మీరు అయితే ఒకసారి ఆ సాంగ్ ని వినేయండి.

Bigg Boss 7 : స‌మంత ఎక్క‌డ‌..? బిగ్‌బాస్ స్టేజీపై విజ‌య్ ను ప్ర‌శ్నించిన నాగార్జున‌

కాగా ఈ సినిమాలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తుంది. ఇమ్రాన్ హష్మి విలన్ గా చేస్తుండగా అర్జున్ దాస్, శ్రియారెడ్డి ప్రధాన పాత్రలు కనిపించబోతున్నారు. 90’s బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ గ్యాంగ్ స్టార్ రోల్ లో కనిపించబోతున్నాడు. చాలా కాలం తరువాత పవన్ ఇలాంటి రోల్ చేస్తుండడంతో అభిమానుల్లో మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.