Bigg Boss 7 : సమంత ఎక్కడ..? బిగ్‌బాస్ స్టేజీపై విజయ్ ను ప్రశ్నించిన నాగార్జున
మరికొన్ని గంటల్లో తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ 7 షురూ కానుంది. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జున(Nagarjuna)నే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

Bigg Boss 7 new promo
Bigg Boss 7 new promo : మరికొన్ని గంటల్లో తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ 7 షురూ కానుంది. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జున(Nagarjuna)నే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి బిగ్‌బాస్ సీజన్ 7 హంగామా మొదలుకానుంది. ఈ క్రమంలో సీజన్ లాంచ్‌కు ముందు ఓ కొత్త ప్రొమోను విడుదల చేశారు. ఈ సారి ఈ హౌస్‌లో ఉండాలి అంటే అంత ఈజీ కాదు అని నాగార్జున చెప్పే డైలాగ్‌తో ప్రొమో ప్రారంభమైంది. కొందరు కంటెస్టెంట్లతో నాగార్జున మాట్లాడినప్పటికీ వారు ఎవరో రివీల్ చేయలేదు.
ఇక ఖుషి సినిమా ప్రమోషన్లలో భాగంగా బిగ్‌బాస్ 7 లాంచింగ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ అతిథిగా వచ్చాడు. ఆరాధ్య సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చాడు. కాగా.. మీ హీరోయిన్ సమంత ఎక్కడ..? అంటూ విజయ్‌ను నాగ్ ప్రశ్నించారు. విజయ్ దేవరకొండ మాత్రం చిరునవ్వుతో సమాధానం చెప్పకుండా దాటవేసినట్లు కనిపించింది. ఆ తరువాత హీరో నవీన్ పొలిశెట్టి వచ్చారు. తనదైన శైలిలో నవ్వించారు.
Kushi Movie Collections : ఖుషి సెకండ్ డే కలెక్షన్స్.. యాదాద్రిలో కుటుంబంతో సహా విజయ్ పూజలు..
ఇక ఈ సీజన్ మాత్రం మిగతా సీజన్లలా కాదని చెబుతూ వస్తున్నారు. ఉల్టాపల్టాగా ఉంటుందని అన్నారు. ప్రతీసారి టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్లకు ప్రైజ్‌మనీని ఆఫర్ చేస్తుండడాన్ని చూస్తూనే ఉన్నాం. అయితే.. ఈ సారి మాత్రం మొదటి ఐదుగురు కంటెస్టెంట్లు ఇంట్లోకి అడుగుపెట్టగానే ఓ సూట్‌కేట్ ఆఫర్ చేశారు. అందులో ఉన్న నగదు తీసుకుని ఎవరైనా ఇప్పుడే వెళ్లిపోవచ్చు అంటూ నాగార్జున చెప్పారు. చూస్తుంటే ఈ సారి సీజన్ లో బోలెడు ట్విస్ట్‌లు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తోంది.
కాగా.. ప్రస్తుతం ఈ ప్రొమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. చాలా కాలం తరువాత నాగార్జున నోటి వెంట సమంత అనే పేరు వినిపించిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్‌కు సమంత కూడా వచ్చి ఉంటే మరో లెవల్‌లో ఉండేదని అంటున్నారు.
Gadar 2 : గదర్ 2 సినిమా 500 కోట్ల సక్సెస్ పార్టీ.. సల్మాన్, షారుఖ్‌తో సహా తరలి వచ్చిన బాలీవుడ్..
ఇదిలా ఉంటే.. ఈ షో రేపట్నుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది. శని, ఆది వారాల్లో మాత్రం రాత్రి 9 గంటలకు మొదలవుతుంది. ఛానల్ లో గంట సేపు మాత్రమే టెలికాస్ట్ కానుంది. డిస్నిప్లస్ హాట్ స్టార్(Disney Plus Hotstar) ఓటీటీలో 24 గంటలు లైవ్ చూడొచ్చు.