అల వైకుంఠపురములో – ప్రమోషనల్ సాంగ్

థమన్ ట్యూన్, సిరివెన్నెల రచన, సిడ్ శ్రీరామ్ కాంబోలో.. 'అల వైకుంఠపురములో'.. ప్రమోషనల్ సాంగ్..

  • Publish Date - September 24, 2019 / 06:09 AM IST

థమన్ ట్యూన్, సిరివెన్నెల రచన, సిడ్ శ్రీరామ్ కాంబోలో.. ‘అల వైకుంఠపురములో’.. ప్రమోషనల్ సాంగ్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘అల… వైకుంఠపురములో’… గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్స్‌పై.. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) కలిసి నిర్మిస్తున్నారు. డీజే తర్వాత బన్నీతో, అరవింద సమేత తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి రెండోసారి పనిచేస్తుంది పూజా హెగ్డే. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

టబు, నివేధా పేతురాజ్, సుశాంత్, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సునీల్, నవదీప్, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చెయ్యనున్నారు. ఆ మేకింగ్ వీడియోలో పాట పాడిన విధానం, ఆ పాటకోసం వేసిన సెట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాంగ్ డిజైన్ చెయ్యనున్నారట.

Read Also : లాల్ కాప్టాన్ – అక్టోబర్ 18న విడుదల..

థమన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా, సిరివెన్నెల రచన, సిడ్ శ్రీరామ్ గాత్రం అందించారు. ఈ సాంగ్ మేకింగ్ వీడియో సినిమాలోనూ ఉండబోతుందట. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న ‘అల… వైకుంఠపురములో’… రిలీజ్ కానుందని తెలుస్తుంది. కెమెరా : పి.ఎస్.వినోద్, ఎడిటింగ్ : నవీన్ నూలి, సంగీతం : థమన్ ఎస్, ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్ : రామ్ – లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పిడివి ప్రసాద్.