Balakrishna : వినూత్న రీతిలో హైద‌రాబాద్ ఉద్యోగుల అభ్య‌ర్థ‌న‌.. బాలయ్య పండక్కి సెలవు కావాలట!

నంద‌మూరి బాల‌కృష్ణ హోస్టుగా చేస్తున్న అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4 రాబోతుంది.

Hyderabad employees Demands Holiday On Balayya Panduga On October 25th

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ హోస్టుగా చేస్తున్న అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4 రాబోతుంది. ఆహా వేదిక‌గా అక్టోబ‌ర్ 25న రాత్రి 8.30 గంట‌ల నుంచి స్ట్రీమింగ్ కానుంది. తొలి ఎపిసోడ్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అతిథిగా వ‌చ్చారు. ఇప్ప‌టికే ఈ షో తొలి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను విడుద‌ల చేశారు. ప్రొమో షో పై అంచ‌నాలను అమాంతం పెంచేసింది. స్ట్రీమింగ్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అక్టోబ‌ర్ 25 ను బాల‌య్య పండుగ‌గా ప్ర‌క‌టించాల‌ని హైద‌రాబాద్‌లో ప‌లువురు ఉద్యోగులు ఫ్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4 స్ట్రీమింగ్ కానున్న శుక్ర‌వారం రోజున సెల‌వు ప్ర‌క‌టించాల‌ని కోరారు.

Love Reddy : ‘లవ్ రెడ్డి’ నటుడిపై ప్రేక్ష‌కురాలి దాడి.. అంద‌రి ముందే గ‌ల్లా ప‌ట్టుకుని

హైటెక్ సిటీ రోడ్లు పై కొంద‌రు చేతిలో ప్లకార్డులు పట్టుకున్నారు. బాలయ్య పండుగ 25న‌ హాలిడే కావాలి అని దానిపై రాసి ఉంది. హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఇలా ఫ్ల‌కార్డుల‌తో కొంద‌రు క‌నిపించారు. చూస్తుంటే బాల‌య్య అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4 గ‌త రికార్డులు అన్నింటిని బ్రేక్ చేసేట‌ట్లుగా క‌నిపిస్తోంది.