Love Reddy : ‘లవ్ రెడ్డి’ నటుడిపై ప్రేక్షకురాలి దాడి.. అందరి ముందే గల్లా పట్టుకుని
ప్రేక్షకుల స్పందన చూద్దామని థియేటర్‌కు వెళ్లిన లవ్‌రెడ్డి సినీ నటుడికి షాక్ తగిలింది.

A Woman attack Love Reddy movie Actor at hyderabad
Love Reddy : ప్రేక్షకుల స్పందన చూద్దామని థియేటర్‌కు వెళ్లిన లవ్‌రెడ్డి సినీ నటుడికి షాక్ తగిలింది. ఓ ప్రేక్షకురాలు నటుడు ఎన్‌టీ రామస్వామిపై దాడి చేసింది. ఈ ఘటన హైదరాబాద్ నిజాంపేటలోని జీపీఆర్ మాల్ మల్టీఫెక్స్‌లో గురువారం చోటు చేసుకుంది.
ఈ చిత్ర క్లైమాక్స్ చూసి ఎమోషనల్ అయిన ఓ ప్రేక్షకురాలు నిజంగానే ప్రేమ జంటను విడదీశాడు అని అనుకోని, ఈ చిత్రంలో తండ్రి పాత్ర పోషించిన నటుడు రామస్వామిని తిడుతూ దాడి చేసింది. ఈ అనుకోని ఘటనతో చిత్రబృందం షాకైంది.
Suriya – Balakrishna : బాలయ్య బాబుతో సూర్య షూటింగ్ ఫినిష్..! అన్‌స్టాపబుల్‌లో సింహాతో సింగం
హీరో అంజన్ రామచంద్ర, హీరోయిన్ శ్రావణి, దర్శకుడు స్మరణ్ రెడ్డి, ఇతర సభ్యులు మహిళను అడ్డుకుని నచ్చజెప్పారు. అది సినిమా అని, సదరు నటుడు తండ్రి పాత్రలో నటించాడని, సినిమాలో చూపించినట్లుగా నిజ జీవితంలో ఆయన చెడ్డ వాడు కాదని ఆ మహిళకు నచ్చజెప్పారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి పంపించి వేశారు.
ఇదిలా ఉంటే.. ఈ నెల 18న లవ్ రెడ్డి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి రెస్పాన్స్ వస్తోంది.
Matka Second single : తస్సాదియ్యా.. వరుణ్‌తేజ్ మట్కా నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్..