Matka Second single : తస్సాదియ్యా.. వ‌రుణ్‌తేజ్ మ‌ట్కా నుంచి స్పెష‌ల్ సాంగ్ రిలీజ్‌..

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ న‌టిస్తున్న మూవీ మ‌ట్కా.

Matka Second single : తస్సాదియ్యా.. వ‌రుణ్‌తేజ్ మ‌ట్కా నుంచి స్పెష‌ల్ సాంగ్ రిలీజ్‌..

Thassadiyya Lyrical

Updated On : October 24, 2024 / 4:34 PM IST

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ న‌టిస్తున్న మూవీ మ‌ట్కా. క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ల పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 14న ప్రేక్ష‌కుల ముందుకు ఈ మూవీ రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో కాస్త వేగం పెంచింది. అందులో భాగంగా వ‌రుస‌గా పాట‌ల‌ను విడుద‌ల చేస్తోంది.

మొద‌టి పాట ‘లే లే రాజా’ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌గా ఇప్పుడు రెండో పాట తస్సాదియ్యాను విడుద‌ల చేసింది. జి.వి ప్ర‌కాశ్ కుమార్ సంగీతాన్ని అందించ‌గా సింగ‌ర్ మ‌నో ఈ పాట‌ను పాడారు. ఇందులో వ‌రుణ్ తేజ్ లుక్స్ చాలా బాగున్నాయి. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

Pushpa 2 Trailer : అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ అప్డేట్.. ఎప్పుడంటే..

ఈ చిత్రంలో అందాల భామ మీనాక్షి చౌదరి క‌థ‌నాయిక‌గా న‌టిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి, నవీన్ చంద్ర, సలోనికీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది.