Suriya – Balakrishna : బాలయ్య బాబుతో సూర్య షూటింగ్ ఫినిష్..! అన్‌స్టాపబుల్‌లో సింహాతో సింగం
ఆహా వేదికగా బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 రాబోతుంది

Hero Suriya at Balakrishna Unstoppable Show
ఆహా వేదికగా బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 రాబోతుంది. అక్టోబర్ 25 రాత్రి 8.30 గంటల నుంచి అన్‌స్టాపబుల్ నాలుగో సీజన్ స్ట్రీమింగ్ కానుంది. తొలి ఎపిసోడ్‌కు అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు వచ్చారు. ఫస్ట్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను ఇప్పటికే విడుదల చేశారు. ప్రొమోతో షో పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
నాలుగో సీజన్‌కు సంబంధించిన మరికొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ జరుగుతోందని సమాచారం. ఓ ఎపిసోడ్‌కు అతిథిగా తమిళ స్టార్ హీరో సూర్య హాజరు అయ్యారట. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో (నేడు) గురువారం జరిగింది.
Matka Second single : తస్సాదియ్యా.. వరుణ్‌తేజ్ మట్కా నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్..
నవంబర్ 14న సూర్య నటించిన కంగువా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తో కలిసి అన్‌స్టాపబుల్ షోకి సూర్య వచ్చారట. ఈ షోలో సూర్యను ఇరకాటంలో పడేసే ప్రశ్నలు బాలయ్య అడిగినట్లుగా తెలుస్తోంది. మరి వీటికి సూర్య ఎలాంటి సమాధానం ఇచ్చారో అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. సూర్య అన్‌స్టాపబుల్ సెట్‌కి వచ్చిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
#Kanguva సూపర్ స్టార్ సూర్య.. at unstoppable show pic.twitter.com/CHWwIXq2vh
— devipriya (@sairaaj44) October 24, 2024
#Suriya arrived for a grand Telugu promotional event at #UnstoppablewithNBK show to happen with Balakrishna Today ❤️🔥
The way they promote & Positioning #Kanguva at Pan Indian level🫡 pic.twitter.com/TVHLFPWaG5
— AmuthaBharathi (@CinemaWithAB) October 24, 2024