Hyderabad Floods: రవితేజ, మైత్రీ మూవీ మేకర్స్ విరాళం..

  • Publish Date - October 20, 2020 / 09:48 PM IST

Hyderabad Floods: భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న ప్రజలను ఆదుకోవడానికి భారీ విరాళాలందిస్తూ తెరవెనుక కూడా హీరోలమని నిరూపిస్తున్నారు మన తెలుగు హీరోలు. తెలంగాణ సీఎం సహాయ నిధికి టాలీవుడ్ సినీ ప్రముఖులు వరుసగా విరాళాలు ప్రకటిస్తున్నారు.

తాజాగా మాస్ మహారాజ్ రవితేజ కూడా స్పందించాడు. తన వంతుగా రూ.10 లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించాడు. ‘ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీఎం సహాయ నిధికి నేను రూ.10 లక్షల విరాళం ప్రకటిస్తున్నాను. ఇలాంటి దురదృష్టకర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచేందుకు మరింత మంది ముందుకు రావాలని కోరుతున్నాను’ అంటూ రవితేజ ట్వీట్ చేశాడు. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమవంతుగా రూ.10 లక్షల సాయాన్ని ప్రకటించారు.